మొగిలిగిద్దలో పంట నష్టం అంచనా రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఉషా
ఇటీవల కురిసిన అకాల భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి వ్యవసాయ శాఖా అధికారులు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ధ గ్రామంలో పర్యటించారు. గురువారం రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఉషా స్థానిక అధికారులతో కలిసి వరి పంటను పరిశీలించడం జరిగింది. అదే విధంగా రైతులతో మాట్లాడుతూ రైతులు అధైర్య పడకూడదనీ 33 శాతం కంటే ఎక్కువ పంట నష్టం జరిగితే వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తారని, నష్టపోయిన అన్ని గ్రామాల్లో అన్ని పంటలను పరిశీలించి నివేదిక లను పంపించాలని అధికారులకు ఆదేశించడం జరిగిందని అధికారి స్పష్టం చేశారు. ఇట్టి పర్యటనలో ఫరూఖ్ నగర్ మండల వ్యవసాయ అధికారి నిశాంత్ కుమార్, ఫరూక్ నగర్ వ్యవసాయ విస్తరణ అధికారి తేజ్ కుమార్ మరియు రైతులు పాల్గొనడం జరిగింది.. KP