మున్నేరు వరద బాధితుల సహాయార్థం రామకృష్ణ మఠం.ఖమ్మం పూర్వ విద్యార్థుల సౌజన్యంతో

Sep 24, 2024 - 19:53
Sep 25, 2024 - 10:21
 0  57
మున్నేరు వరద బాధితుల సహాయార్థం రామకృష్ణ మఠం.ఖమ్మం పూర్వ విద్యార్థుల సౌజన్యంతో

తేదీ: 24-09-24.కమాన్ బజార్: రామకృష్ణా విద్యాలయంలో ఈ రోజు మున్నేరు వరద బాధితుల సహాయార్ధం రామకృష్ణ మఠం - హైదరాబాద్, VIHE - ఖమ్మం మరియు పూర్వ విద్యార్థుల సౌజన్యంతో 400 మంది బాదితులకు 25 కేజీల బియ్యం, స్టీల్ పాత్రలు, ప్లాస్టిక్ బక్కెట్స్ మరియు ఒక నెలకు సరిపడా నిత్యావసరాల కిట్స్ ను స్వామి పూజానంద గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగినది. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ అర్బన్ హెల్త్ సెంటర్స్ వెంకటేశ్వర నగర్, సారధి నగర్, జూబ్లీపురా, మామిళ్లగూడెం, శ్రీనివాసనగర్, ముస్తఫానగర్ సెంటర్లలో వాలంటీర్లుగా పనిచేస్తున్న ఆశా వర్కర్స్ మరియు సుందరయ్య నగర్ లో నివాసముంటూ ప్రభుత్వ ఆసుపత్రిలో సైకిల్ స్టాండ్ నిర్వహిస్తున్న స్తంభాద్రి వికలాంగుల సమాఖ్య సభ్యులు ఇటీవల సంభవించిన వరదలకు సర్వస్వం కోల్పోయినారు. అలాంటి 66 మంది బాధితులకు కూడా ఈరోజు కిట్స్ అందజేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో VIHE నిర్వాహకులు దేవకి వాసుదేవరావు, వాలంటీర్లు మరియు హెల్త్ సూపర్ వైజర్ పెద్దినేని రాధాకృష్ణ, స్కూల్ ప్రధానోపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు చంద్రశేఖర్, జయంత్ పటేల్, జి పి చిరంజీవి, పెనుగొండ ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State