పరిసరాల పరిశుభ్రత సామాజిక  బాధ్యత 

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి

Sep 24, 2024 - 18:17
 0  6
పరిసరాల పరిశుభ్రత సామాజిక  బాధ్యత 
పరిసరాల పరిశుభ్రత సామాజిక  బాధ్యత 

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి  సూచించారు. జిల్లా కోర్టు ఆవరణలో మంగళవారం స్వచ్ఛభారత్ కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగ న్యాయమూర్తి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం  మనందరి సామాజిక బాధ్యత అని తెలిపారు. కోర్టు ఆవరణలో ఉన్న చెత్తను న్యాయమూర్తులు,  న్యాయవాదులు, కోర్టు సిబ్బంది  తొలగించారు. కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ మహాత్మా గాంధీ చూపిన మార్గం అందరికీ   ఆదర్శప్రాయమని ఆయనను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం గాంధీ జయంతి సందర్భంగ జిల్లా కోర్టు ఆవరణలో స్వచ్ఛభారత్ కార్యక్రమంను నిర్వహించుకోవడం మంచి పరిణామం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బత్తుల రామారావు, ఏపీపీలు పివిడి లక్ష్మి, ఎన్.లావణ్య, విశ్వశాంతి, నాగలక్ష్మి, లాడ్స్ ఊట్కూరు పురుషోత్తమరావు, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షులు తోట మల్లేశ్వరరావు, ఏపూరి బాబురావు, కటికం  పుల్లయ్య అనుబ్రోలు రాంప్రసాదరావు, పిట్టల రామారావు, మల్లెల ఉషారాణి,  మెండు రాజమల్లు, న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఉద్యోగులు రామిశెట్టి రమేష్, లగడపాటి సురేష్, మీనా కుమారి, ప్రమీల, కృష్ణకుమారి, యాధా రమణ, దీకొండ రవి, ఉష, సిస్టమ్ ఆఫీసర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333