మీసేవ కేంద్రాన్ని తనిఖీ చేసిన తహసిల్దార్
తిరుమలగిరి 10 జనవరి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ :- తిరుమలగిరి మండల కేంద్రంలోని మీ సేవ కేంద్రాన్ని మండల తహశీల్దార్ బి. హరి ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించి, సర్టిఫికెట్లపై ఎక్కువ మొత్తంలో ఫీజు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడునని తగు సూచనలు ఇవ్వడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో తహశీల్దార్ వెంట ఆర్ఐ సుజిత్ రెడ్డి, మండల సర్వేయర్ జోసఫ్ మరియు జూనియర్ అసిస్టెంట్ అశోక్ తదితరులు పాల్గొన్నారు