రైతులకు అందుబాటులో యూరియా

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ రైతులకు అందుబాటులో యూరియా. వేసవి సాగుకు రైతులకు సరిపడా యురియా అందుబాటులో ఉన్నదని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని మండల వ్యవసాయ అధికారిని దంతాల దివ్య అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఏపూరు నెమ్మికల్ గ్రామాలలోని పిఎసిఎస్ కేంద్రాలలో యూరియా పంపిణి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపూరు కేంద్రానికి 1213 బ్యాగులు, నెమ్మికల్ కేంద్రానికి 560 బ్యాగులు వచ్చాయని రైతుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని మరిన్ని యూరియా బ్యాగులు తెప్పిస్తామని అన్నారు.