గుడిసె గూడైంది.
గుడిసెలో పుట్టి
బురుదలో ఆడి
వంటిమీద వస్త్రం లేదు
కాళ్లకు చెప్పులు లేవు
బాల్యమంత బరువె
చెత్త కాగితలతో
చెలిమి చేయాలి
కాలి సీసాలతో
కలిసి ఉండాలి
మురికి నీటినె ట్రాగుతుండాలి
వర్షానికి ప్లాస్టిక్ కవర్
ఎండ వేడిమికి అట్టాపేపర్
చలికి సగం చిరిగిన దుప్పటి
కాలానికి తగినట్లు మార్చుకోవాలి
కలో, గంజో త్రాగి బ్రతకాలి
మురికి కాలువలు
బస్సు షెల్టర్లు, రైలు స్టేషన్లు
పాడుబడిన భవంతులు అప్పుడప్పుడు ఆధునిక
మెట్రో పిల్లర్లే అడ్డాగా అవుతాయి
కాగితలు, కాలి సీసాలు దొరికితేనే
కడుపులోకాసింతఅన్నం పడుతుంది లేదంటే
పండుగలకు, కార్యాలకు, దేవస్థానంలలో, రోడ్డులపైన
అన్నదాన శిబిరలకు క్యూ కట్టాలి
పాత బట్టలు
పారేసిన చెప్పులు
కొత్తగా కనబడుతాయి
ఉతికి ఆరెసుకుంటే,
అవి మురిపిస్తూ
పండుగను మరిపిస్తాయి
ఇది కొందరి జీవిత ప్రస్థానం
బాల్యమునుండే మొదలవుతుంది
బాధలు తెలియకుండా సాగుతు
వీధి వీధిన తిరుగుతుంది
విధిరాసిన రాతలా అనిపిస్తుంది
ధనవంతులు,స్వచ్చంద సంస్థలు
దాతలు ముందుకొచ్చి
ఆ అభాగ్యులను ఆదుకోవాలి
వారి జీవితాలలో కొంతైనా
మార్పు తేవాలి.
రచన.
కడెం. ధనంజయ
చిత్తలూర్