క్లీనర్లు లేని ప్రవేట్ పాఠశాల బస్సుల తనిఖీ బిజెపి నాయకులు
జోగులాంబ గద్వాల 23 ఆగస్టు 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: వడ్డేపల్లి. మున్సిపాలిటీ అధ్యక్షుడు రామకృష్ణ మరియు మండల అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ నేతలు అందరూ కలిసి మున్సిపాలిటీ పరిధిలోని ప్రవేట్ పాఠశాల బస్సులను రోడ్డుపై ఆపి క్లీనర్లు ఉన్నారా లేరా అని తనిఖీలు చేశారు. కొన్ని పాఠశాల వాహనాలకు ఉన్నారు కొన్నింటికి లేరు. లేని వాహనాలకు క్లీనర్ ఎక్కడ అని అడిగితే ప్రవైట్ పాఠశాల యాజమాన్యాలు వచ్చి అతి త్వరలో సిబ్బందిని నియమిస్తామన్నారు. బస్సుల్లో సీట్ కేపాసిటి పరిమితి మించి ఎక్కిస్తున్నారు . దీనికి సంబంధించిన RTO, ట్రాఫిక్ పోలీసులు,MEO గారు తరుచూ తనిఖీలు చేస్తూ ఉండాలన్నారు . ప్రైవేటు పాఠశాలల బస్సుల పూర్తి నివేదికను త్వరలో కలెక్టర్ దృష్టికి తీసుకుపోతమని బీజేపీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మధుసూదన్ గౌడ్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు గవ్వల శ్రీనివాసులు , పట్టణ ప్రధాన కార్యదర్శి బోయ వెంకటేశ్వర్లు, సంజన్న , మోహన్ యాదవ్, శేఖర్ ఆచారి, మద్దూరు అశోక్ తదితరులు పాల్గొన్నారు.