ఇంటర్నేషనల్ రీసెర్చ్ జనరల్ కు ఎంపికైన దామెర శ్రీనివాస్

తిరుమలగిరి 10 జనవరి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ :- తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా , తిరుమలగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెఢ్ హెడ్ మాస్టర్ దామెర శ్రీనివాస్ పరిశోధనా పత్రం ఇంటర్నేషనల్ మల్టి డిసిప్లినరీ రీసెర్చ్ జర్నల్ లో ప్రచురితం కావడం అభినందనీయం అని TUTF రాష్ట్ర బాధ్యులు, జిల్లాలోని వివిధ ఉపాద్యాయ సంఘనాయకులు అన్నారు. ఎ స్టడీ ఆన్ జాబ్ సాటిసఫాక్షన్ అండ్ ప్రొఫెషనల్ పెర్ఫార్మెన్స్ అమాంగ్ సెకండరీ స్కూల్ టీచర్స్ " అనే అంశంపై దామెర శ్రీనివాస్ రాసిన పరిశోధనా పత్రం మహారాష్ట్ర కు చెందిన ప్రో. వినయ్ శంకర్ రావు హేటోల్ సంపాదకత్వంలోని, అజంతా ప్రకాశన్ ముద్రితమైన "రాయల్ ఇంటర్నేషనల్ మల్టి డిసిప్లినరీ రీసెర్చ్ ISSN యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ జాబితాలోని జర్నల్ వాల్యూం 13, ఇష్యూ 2 " లో ప్రచురితం అయింది. అంతర్జాతీయ జర్నల్ లో పరిశోధనా పత్రం ప్రచురితం కావడం పాఠశాల విద్యా రంగానికి గర్వకారణమని జిల్లా ఉన్నతాధికారులు, తిరుమలగిరి మండల వివిధ ఉపాద్యాయ సంఘ నాయకులు సోమయ్య, బోసుబాబు, జానయ్య ,పాఠశాల ఉపాద్యాయులు , MEO శాంతయ్య, మండలం లోని పలువురు గజెట్టెడ్ ప్రధానోపాధ్యాయులు , మాశెట్టి శ్రీనివాసులు, అశోక్ రెడ్డి, CPS ఎంప్లాయీస్ నాయకులు డాక్టర్ మేడబోయిన లింగయ్య, SSA ఉద్యోగుల సంఘం బాధ్యులు తదితరులు అభినందించారు.