మిధానిలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ, జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు
హైదరాబాద్, 6 మార్చి 2026 తెలంగాణా వార్త రిపోర్ట్ :- మిధానిలో ఆదివారం ఎస్సి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ, జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చైర్మన్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ సేవలు మరువలేని అని అన్నారు.1946లో, అతను జవహర్‌లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్ కార్మిక మంత్రి, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడు.అతను సామాజిక న్యాయం రాజ్యాంగంలో పొందుపరచబడిందని నిర్ధారించాడు. అతను భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా నలభై సంవత్సరాలకు పైగా వివిధ శాఖల క్యాబినెట్ మంత్రిగా పనిచేశాడు. మరీ ముఖ్యంగా అతను 1971 ఇండో-పాక్ యుద్ధం జరిగిన సమయంలో భారత రక్షణ మంత్రిగా ఉన్నాడు, ఫలితంగా బంగ్లాదేశ్ ఏర్పాటుకు సుగమం ఏర్పడింది. భారతదేశంలో హరిత విప్లవం, భారత వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో అతను అందించిన సహకారం, కేంద్ర వ్యవసాయ మంత్రిగా తన రెండు పదవీకాలాల్లో 1974 కరువు సమయంలో, ఆహార సంక్షోభాన్ని నివారించటానికి ప్రత్యేకంగా అదనపు మంత్రిత్వ శాఖను నిర్వహించమని కోరినప్పుడు అంగీకారం తెలుపటం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ వి ఎస్ నారాయణ మూర్తి, డిపిఎంపీ బాబు, డిఎఫ్ మధుబాల మేడం, అసోసియేషన్ లిసెన్ ఆఫీసర్ ఆనంద్ కుమార్, అసోసియేషన్ ప్రెసిడెంట్ సుబ్బారావు, జనరల్ సెక్రెటరీ కిష్టయ్య, కోశాధికారి చిరంజీవి, అసోసియేషన్ సభ్యులు మంజుల,అల్లుడు శ్రీను, కిర్బీ MW&SU ప్రెసిడెంట్ శ్రీహరి,MEU ప్రెసిడెంట్ నారాయణ, ఓబీసీ ప్రెసిడెంట్ సంజీవ్,ఎస్టీ అసోయేషన్ శ్రీను,NUS క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.