మానవపాడు ఇండియన్ గ్యాస్ వద్ద బారులు తీరిన వినియోగదారులు

Apr 4, 2026 - 07:02
Apr 4, 2026 - 07:31
 0  0

గ్యాస్ బుక్ చేసుకున్న ఓటిపి పేరుతో ముప్పు తిప్పలు

గ్యాస్ లో పనిచేసే సిబ్బంది   నిర్లక్ష్య వైఖరి

గ్యాస్ కోసం వచ్చిన వినియోగదారులకు కనీసం మంచినీళ్లు కూడా ఏర్పాటు చేయని గ్యాస్ గోదాం యాజమాన్యం

జోగులాంబ గద్వాల 3ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- మానవపాడు. మండల కేంద్రంలోని ఇండెన్ గ్యాస్ వద్ద శుక్రవారం వినియోగదారులు సిలిండర్లను క్యూ లైన్ లో పెట్టి ఎండకే పడిగాపులు కాస్తున్నారు.మిట్ట మధ్యాహ్నం కావస్తున్న గ్యాస్ గోదాం సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. బూడిదిపాడు నుంచి ఏకంగా ఒక మహిళ చంటి పిల్లలు సంకన పెట్టుకుని గ్యాస్ సిలిండర్ తో వచ్చి పడిగాపులు కాస్తుంది.గ్యాస్ బుక్ చేసుకున్న ఇక్కడ సిబ్బంది ఓటీపీ పేరుతో ముప్పు తిప్పల పెడుతున్నట్లు ఆ గ్రామాలకు చెందిన వినియోగదారులు వాపోయారు. అంతేకాక బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్ను అమ్ముకున్నట్లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఎండాకాలం ఇండియన్ గ్యాస్ కేంద్రం వద్దకు వచ్చిన వినియోగదారులకు కనీసం గుక్కెడు నీళ్లు తాగేందుకు  నీటి వసతిని కూడా ఏర్పాటు చేయలేదని మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు గోదాం వాళ్లు కనీసం నీటి వసతి కూడా కల్పించడం లేదని పది రోజుల నుంచి గ్యాస్  సిలిండర్ పట్టుకొని గ్యాస్ గోదాముల చుట్టూ తిరుగుతున్నట్లు లబ్ధిదారులు వాపోయారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State