భారీ ప్రమాదం జరిగి ప్రాణాలు పొతే గాని స్పందించరా
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు S.రామచంద్రారెడ్డి మడిపాటు
జోగులాంబ గద్వాల 3 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- అయిజ పట్టణం బీజేపీ అధ్యక్షులు తెలుగు నర్సింహా ఆధ్వర్యంలో మునిసిపల్ పరిధిలో ఉన్న రాయచూరు -కర్నూలు బిర్జ్ పరిశీలించి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ బిర్జ్ కూలడానికి సిద్ధం గా ఉన్న పాలకులు అధికారులు పట్టించుకోకుండా ప్రజల ప్రాణాల తో చెలగాటం ఆడుతున్నారు అని గతంలో బీజేపీ కార్యకర్తలు పలు మార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారని ఈ మధ్యనే కేసులు కూడా అయ్యావని ఈ బిర్జీపై నిత్యం వేలది భారీ వాహనాలు వెళుతుంటాయి అని ఆంధ్రప్రదేశ్,తెలంగాణ, కర్ణాటక రాష్ట్రలకు అనుసంధానం ఇన ఈ బిర్జ్అని కాబట్టి రోజు భారీ సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగుతుంటాయి అని గత 4 వర్షం కాలాలు పలు సందర్భాలలో బిర్జ్ పై నీళ్లు రావడం వలన రాకపోకలు బందు కావడం జరిగింది ఎప్పుడు ఏదయినా భారీ వాహనం గనుక కూలి ప్రాణాలు పోతే బాధ్యత ఎవరిది అని, కనీసం ఈ వేసవిలో నైనా పూర్తి చేయాలని లేని పక్షం ప్రజా పోరాటం తప్పదు అని హెచ్చరించారు ఈ కార్యక్రమం బీజేపీ నాయకులు కంపాటి భగత్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, రాజశేఖర్, ఖుషి, భీమన్న, శ్రీకాంత్, రవిసాగర్ తదితరులు పాలుగోన్నారు.