సామాజిక తెలంగాణనే మా ధ్యేయం

NHPS జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్.

Apr 4, 2026 - 06:57
Apr 4, 2026 - 07:47
 0  1

 ఏప్రిల్ 8న తెలంగాణ జాగృతిలో చేరికకు ముహూర్తం ఖరారు.

సామాజిక తెలంగాణతో  ఉద్యమిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు

శ్రీమతి.కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో భారీ ఎత్తున చేరికలకు సర్వం సిద్ధం.

విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించిన NHPS జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్.

జోగులాంబ గద్వాల 3ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల జిల్లా నడిగడ్డ హక్కుల పోరాట సమితి వేదికగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, సమస్యల పరిష్కారం దిశగా నడిగడ్డలో ఉద్యమాన్ని కొనసాగిస్తూ, అన్యాయాలను అరికట్టి ప్రజా శ్రేయస్సుకై ప్రశ్నించే గొంతుకగా నడిగడ్డ ప్రజల తరఫున అనేక సమస్యలపై గళం విప్పుతున్నామని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణపై ఆయన పూర్తి క్లారిటీ ఇచ్చారు. 

ఏప్రిల్ 8వ తేదీన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ శ్రీమతి. కల్వకుంట్ల కవిత సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... గత 2014 సంవత్సరం నుండి నేటి వరకు నడిగడ్డ ప్రాంత సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తూ, ఈ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ, బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి, నడిగడ్డ హక్కుల పోరాట సమితి వేదికగా పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు.

 తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని మరియు జోగులాంబ గద్వాల జిల్లా సాధనకై ముందుండి పోరాటం చేశామన్నారు.  అలాగే 2018 వ సంవత్సరం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బిఎల్ఎఫ్) పార్టీ నుండి గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగిందన్నారు.

 2023 వ సంవత్సరంలో రెండవసారి (ఏ.ఐ.ఎఫ్.బీ) ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి గద్వాల గడ్డపై నీతి నిజాయితీతో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ప్రజల మన్ననలు పొందడం జరిగిందని అన్నారు. 

నడిగడ్డ ప్రాంతంలో కుటుంబ పాలనలో పేద ప్రజలు అన్యాయానికి గురవుతున్న తరుణంలో నడిగడ్డ ప్రాంత అభివృద్ధి కోసం, ఆత్మ గౌరవం కోసం, విద్య, వైద్యం , అభివృద్ధి సంక్షేమం కోసం, రైతుల సంక్షేమం కోసం, విత్తనపత్తి రైతుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున జిల్లాలో అనేక పోరాటాలు చేశామని గుర్తు చేశారు.

 70 సంవత్సరాలుగా కుటుంబ పాలన చేత ఈ ప్రాంత ప్రజలు నలిగిపోతున్న విషయాన్ని నడిగడ్డ హక్కుల పోరాట సమితి వేదికగా పేద వర్గాలు పడుతున్న గోసను వివరించామని, ఆత్మగౌరవ పాదయాత్రతో జిల్లాలోని ఉద్యమ సంస్థ ద్వారా అనేక సమస్యలను గుర్తించి అట్టి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసి ప్రజలను చైతన్యం చేశామని తెలిపారు. 

ఈ నడిగడ్డ ప్రాంతం విద్యలో అత్యంత వెనుకబాటుతనానికి గురైందని, అనేక పాఠశాలలో స్వచ్ఛంద సంస్థ సహకారంతో నడిగడ్డ హక్కుల పోరాట సమితి తరపున అనేకమైన ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదులను నిర్మించామని అలాగే వివిధ పాఠశాలలో విద్యార్థులకు తాగునీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 
పాఠశాల విద్యార్థులకు టాయిలెట్,మరుగుదొడ్లు వంటి గదులతో పాటు, విద్యార్థుల విద్యా బోధనకు కావలసిన సామాగ్రిలు మరియు ప్రొజెక్టర్లను కూడా అందజేయడం జరిగిందని,అలాగే అనేక అభివృద్ధి లక్ష్యంగా ఆయా గ్రామలలో విద్యుత్ ద్వీపాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో విత్తనపత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై 
నిరంతరం పోరాటం చేస్తునే మధ్యవర్తుల ఆగడాలను ప్రశ్నిస్తూ రైతుల పక్షాన అండగా నిలబడ్డామన్నారు.

ఈ ప్రాంతంలో పల్లె సమస్యలపై పల్లెనిద్ర,ఓటు చైతన్య యాత్రతో పాటు ఆత్మగౌరవ పాదయాత్ర చేసి నడిగడ్డ ప్రాంత ప్రజలను చైతన్యం చేశామని తెలిపారు. 

నడిగడ్డ హక్కుల పోరాట సమితి వేదికగా చేస్తున్న పోరాటాలను గుర్తించి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుండి బహుజన నాయకుడిగా పోరాటం చేస్తున్న మాకు టికెట్ వచ్చే అవకాశాలు ముండుగా ఉన్నప్పటికీ కుటుంబ పాలనను గద్దె దించుతారనే భయంతోనే ఉద్దేశ పూర్వకంగా ఈ ప్రాంత పాలకులు అనేక కుట్రలు చేసి ప్రధాన పార్టీల నుంచి తమకు టికెట్  రానీయకుండా గతంలో అనేక రకాలుగా అడ్డుకున్న పరిస్థితి నెలకొందని ఈ విషయం జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు అని అట్టి విషయాన్ని గుర్తు చేశారు. 

మా పోరాటాన్ని మెచ్చి మా శ్రేయస్సు కోరేవారు మరియు నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు కార్యకర్తలు అందరి అభిష్టం మేరకు తెలంగాణ సామాజిక న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో అందరి సమష్టి మేరకు రాజకీయ పార్టీలో వారితో పాటు తాము కూడా తెలంగాణ జాగృతిలో భాగస్వాములై పోరాటం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 

రేపు అనగా ఏప్రిల్ 25 తేదీన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నారని, సామాజిక న్యాయమే ధ్యేయంగా బడుగు,బలహీన వర్గాల కోసం తెలంగాణలో త్వరలోనే ఉద్యమ పార్టీగా అతి పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నారని తెలిపారు.

గద్వాల నియోజకవర్గంలో  స్థానిక ఎమ్మెల్యే అన్ని రాజకీయ పార్టీలను కబ్జా చేశారని, ఏ పార్టీలో కొనసాగుతున్నారో నియోజకవర్గ ప్రజలు అయోమయంలో ఉన్నారని తెలిపారు. ఇది కేవలం వారి రాజకీయ లబ్ధి కోసమే అని మాట్లాడారు. రాజకీయంగా ఎదగనీయకుండగా నడిగడ్డ ప్రాంతంలో అనేక కుట్రలకు పాల్పడుతున్నారని మండి పడ్డారు.

ఏప్రిల్ 8వ తేదీన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత  ఆధ్వర్యంలో చేరుతున్నామని, నడిగడ్డలోని జిల్లా మరియు నియోజకవర్గ ప్రజల మన్ననలు మరియు ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు జిల్లా కార్యదర్శి లవన్న,జిల్లా నాయకులు వెంకట్రాములు, రంగస్వామి, ధరూర్, మల్దకల్, గట్టు మండలాల అధ్యక్షులు నెట్టెంపాడు గోవిందు, విష్ణు,బలరాం నాయుడు, మండల ఉపాధ్యక్షులు ప్రేమ్ రాజ్,మునెప్ప, మల్దకల్, అడివి ఆంజనేయులు, నజుముల్లా, మండల కార్యదర్శులు రాము, దయాకర్, ఉప్పరి కృష్ణ, మండల ముఖ్య నాయకులు గోపాల్, లక్ష్మన్న, దొడ్డన్న, విజయ్, వెంకటేష్, కేపీ రామక్రిష్ణ, చిన్న రాముడు, సర్వేశ్, భూపతి నాయుడు,సామెల్, స్వామి,ఆశన్న, నరసింహ, మరియు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State