మహిల శక్తి ఉపాధి బరోస
తుంగతుర్తి డిసెంబర్ 11తెలంగాణ వార్త ప్రతినిధి:- పౌల్ట్రీ షెడ్ కు ముగ్గు పోసి ప్రారంభించిన డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు ఉపాధి హమి పథకంలో భాగంగా తూర్పుగూడెం గ్రామానికి చెందిన గుండగాని జమున బుధవారం నాడు పౌల్ట్రీ షెడ్ అమలు చేసి మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూతనందిస్తోంది. తమ ఇంటి వద్దే స్వయం ఉపాధి ద్వారా మహిళలకు ఆర్థిక ప్రయోజనం పొందేలా పౌల్ట్రి షెడ్డు ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. బహిరంగ మార్కెట్‌లో కోళ్ల పెంపకానికి, కోడి మాంసానికి ఎంతో డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఎక్కువ ధర కూడా ఉండడంతో మహిళలకు ఈ పథకం ద్వారా ఇంటి నుంచే ప్రతి నెలా వేల రూపాయలు సంపాదించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. గ్రామీణాభివృద్ధి శాఖ తమ జిల్లాల నెట్ వర్క్ ద్వారా ఈ పథకాన్ని కార్యరూపంలోకి తీసుకువస్తోంది. కోళ్ల పెంపకాన్ని మహిళలు చాలా సులభంగా చేయగలుగుతారని, తద్వారా వారి నెలవారీ ఆదాయం గణనీయంగా పెరిగి ఆయా కుటుంబాల జీవన ప్రమాణాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.ఈ కార్యక్రమంలో ఎంపిఓ కృష్ణయ్య, ఎపియం రాంబాబు , సీసీ యాదగిరి, సిఎఫ్ నర్మద, సిఎఫ్ నర్సింగ్ ,ఈసీ బిక్షం ,టిఎ దుర్గయ్య, టిఎ శ్రీను, ఏఫ్ఎ పద్మ, కార్యదర్శి నవీన్ ,తదితరులు పాల్గొన్నారు.