మరణించిన పోలీసు కుటుంబానికి ఆర్ధిక భద్రత కల్పించిన జిల్లా ఎస్పీ రితిరాజ్,IPS .
జోగులాంబ గద్వాల 30 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల. అనారోగ్యం తో మరణించిన పోలీస్ అధికారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ రితిరాజ్, IPS భద్రత ఎక్స్ గ్రేషియ క్రింద 8,00,000/- రూపాయల ఆర్థికసాయాన్ని అందజేసారు. జిల్లా లోని ఇటిక్యాల పోలీస్ స్టేషన్ లో ఏ.ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న ఏ. అయ్యన్న గత సంవత్సరం డిసెంబర్ నెలలో హార్ట్ ఎటాక్ తో మరణించగా వారి కుటుంబ సభ్యులకు భద్రత ఎక్స్ గ్రేషియ క్రింద 8,00,000/- (ఎనిమిది లక్షల రూపాయలు) రూపాయల చెక్ ను జిల్లా ఎస్పీ అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వారి కుటుంబ స్థితి గతులను, వారి కుమారుల విద్యా అభ్యసన వివరాలను తెలుసుకొని మాట్లాడుతూ విధి నిర్వహణలో మరణించిన పోలీస్ కుటుంబాలకు అన్ని వేళలా అండగా ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తామని అన్నారు. వారి కుటుంబానికి రావాల్సిన మిగిలిన బెనిఫిట్స్ అన్ని కూడా త్వరగా వచ్చేందుకు కృషి చేయాలని కార్యాలయ ఏ ఓ ని ఆదేశించారు.
ఈ కార్యక్రమములో ఏ. ఓ సతీష్ కుమార్ , సూపరింటెండెంట్ నాగేంద్ర కుమార్, ఏ. ఎస్సై కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.