మన ఇసుక రవాణా దరఖాస్తులు ప్రారంభం

తిరుమలగిరి 03 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్- ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన మన ఇసుక వాహనం సాండ్ టాక్సీ పతకం పై ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, తహసిల్దార్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దిగువ చూపిన ఆధారములతో తహశీల్దార్ కార్యలయంలో సమర్పించాలని కోరారు. సాండ్ మేనేజ్మెంట్ సొసైటీ సూర్యాపేట వారి పేరున రూపాయలు.20,000/- డీడీలు తీయాలి ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ పవర్స్ యజమాని బ్యాంకు అకౌంట్ ఆధార్ కార్డు ఇన్సూరెన్స్ పేపర్స్ పొల్యూషన్ సర్టిఫికెట్ సమర్పించాలని అలాగే మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి పేర్లను క్రమ సంఖ్య ప్రకారం రికార్డు చేయబడును, ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు