కట్కూరి లక్ష్మమ్మకు నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
తిరుమలగిరి 03 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- తిరుమలగిరి మున్సిపాలిటీ కి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కట్కూరి రమేష్ మాతృమూర్తి కట్కూరి లక్ష్మమ్మ ఆదివారం రాత్రి పరంపదించారు. మృతురాలి పార్థీవ దేహాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం సందర్శించి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం కమిషన్ సభ్యులు సంకపల్లి సుధీర్ రెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులకు పదివేల రూపాయల ను పంపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సంకేపల్లి కొండల్ రెడ్డి, మైనార్టీ సెల్ నాయకులు ఎండి కలీం పాషా, కౌన్సిలర్లు బత్తుల శీను, ఎం జితేందర్, గాదరబోయిన లింగయ్య, పసునూరి శ్రీనివాస్, కొంపల్లి విష్ణు గౌడ్, రమేష్ రెడ్డి ,వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.