మద్యం దుకాణాలు జన వాసాల మధ్యలో నిర్వహించవద్దు బిజెపి మండల అధ్యక్షుడు ననుబోతు సైదులు
అడ్డగూడూరు19 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– మండలంలోని నూతన టెండర్లు ద్వారా పొందిన మద్యం దుకాణలను జనవాసులకు దూరంగా దుకాణాలు ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.నిత్య వివిధ గ్రామాల ప్రజలు అడ్డగూడూరు మండల కేంద్రానికి ఎమ్మార్వో,మీసేవ మరియు సిఎస్ సి సెంటర్లకు ప్రభుత్వ పనుల మీద వచ్చే ప్రజలకు విద్యార్థులకు ఎమ్మార్వో ఆఫిస్ ఎదురుగ మద్యం షాపులు ఉండటం వల్ల మహిళలకు విద్యార్థులకు అసౌకర్యంగా కలుగుతుంది.మద్యం షాప్ కి వచ్చేవారు తమ వాహనాలను రోడ్డుపైన నిలిపి వచ్చే పోయే వారికి అడ్డంకుగా మారింది. ఏర్పాటు చేయబోయే మద్యం షాపులను ఎక్సైజ్ అధికారులు కూడా ఊరిలో అనుమతి ఇవ్వకుండా ఊరికి దూరంగా ఏర్పాటు చేసే విధంగా చర్య తీసుకోవాలి తద్వారా వివిధ పనుల మీద వచ్చే ప్రజలకు ఆటంకం కలవకుండా ఉంటుంది ప్రజలకు ఆ సౌకర్యం కలగకుండా ఉండాలని అడ్డగూడూరు మండల భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లేనిపక్షంలో భారీ ఎత్తున నిరసనలు చేపట్టే ప్రయత్నం చేస్తుందని బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ననుబోతు సైదులు ఒక ప్రకటనలో తెలిపారు.