మంత్రులకు రైతుల పక్షన వినతి పత్రం ఇచ్చేందుకు బయలుదేరిన

Sep 25, 2024 - 15:40
 0  2
మంత్రులకు రైతుల పక్షన వినతి పత్రం ఇచ్చేందుకు బయలుదేరిన
మంత్రులకు రైతుల పక్షన వినతి పత్రం ఇచ్చేందుకు బయలుదేరిన

బాసు హనుమంతు నాయుడు ను మరియు పార్టీ నాయకులను అరెస్టు చేసి,స్టేషన్ కు తరలించిన పోలీసులు...

రైతుల సమస్యలపై మంత్రులకు వినతిపత్రం ఇచ్చేందుకు బయలుదేరిన మమ్మల్ని అరెస్టు చేయడం హేమమైన చర్య...

జోగులాంబ గద్వాల జిల్లా బిఆర్ఎస్ నాయకులు
బాసు హనుమంతు నాయుడు 

ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర మంత్రులను కలిసి, గట్టు పోతుల పథకంలో రైతులు యొక్క భూమి విషయంలో మరియు నియోజకవర్గంలో రుణమాఫీ కానీ రైతుల పక్షాన మంత్రులకు వినతిపత్రం ఇచ్చేందుకు,గద్వాల్ పట్టణం నుంచి గట్టుకు బయలుదేరేందుకు వెళ్లిన బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు బాసు హనుమంతు నాయుడు మరియు పార్టీ జిల్లా నాయకులను పోలీస్ లు అరెస్టు చేసి,స్టేషన్ కు తరలించారు...

ఈ సందర్భంగా బాసు హనుమంతు నాయుడు మాట్లాడుతూ...

అంతర్రాష్ట్ర ప్రాజెక్టులో భాగంగా గట్టు ఎత్తిపోతుల పథకంలో భూములు పోతున్న రైతుల విషయంపై మరియు రుణమాఫీ కానీ రైతుల సమస్యలపై మేము మంత్రులకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న మమ్మల్ని అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు...? నియోజకవర్గ వ్యాప్తంగా చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదని దీనిపై మేము ప్రశ్నిస్తే,అరెస్టు ఎందుకు చేస్తున్నారని మండిపడ్డారు.. రైతుల పక్షన ఎల్లప్పుడూ బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని వారన్నారు....

వీరి వెంట,మోనేష్,శేఖర్ నాయుడు,తిరుమల,s.రాము,కురువ పుల్లయ్య,బాసు గోపాల్,రాజు నాయుడు,రాయపురం వీరేష్,హమోద్,మజ్జు,సామెల్,రవి,సురేష్,కామేష్,మరియు పార్టీ నాయకులు ఉన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333