మండల కేంద్రానికి బస్సు సౌకర్యం కల్పించండి

May 19, 2025 - 20:51
 0  2
మండల కేంద్రానికి బస్సు సౌకర్యం కల్పించండి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ మండల కేంద్రానికి బస్సు సౌకర్యం కల్పించండి. సూర్యాపేట ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మీనారాయణ  కి గ్రామస్తులు వినతి.. ఆత్మకూరు మండల కేంద్రానికి సూర్యాపేట డిపో నుండి బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు సోమవారం సూర్యాపేట ఆర్టీసీ డిపో మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు. సూర్యాపేట నుండి ఆత్మకూరు మీదుగా ఖమ్మం కు బస్సులు నడిపించాలని వారి ప్రతిపత్రంలో కోరారు. ఆత్మకూరు మండల ప్రజలు ఖమ్మంలో మిర్చి పత్తి విక్రయాలతో పాటు వైద్య సదుపాయం కొరకు నిత్యం వీరంతా సూర్యాపేటకు వచ్చి ఖమ్మం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అదేవిధంగా మండల కేంద్రం లో ప్రభుత్వ కార్యాలయాలకు రావాల్సిన అధికారులు ప్రజలు రోజు ఆటోని ఆశ్రయించి రావాల్సి వస్తుందని తెలిపారు. వెంటనే మండల కేంద్రానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు . వినతి పత్రం ఇచ్చిన వారిలో కసగానిబ్రహ్మం, డేగల వెంకటకృష్ణ, జలగం మల్లేష్, పందిరి మాధవరెడ్డి తదితరులున్నారు.