పొలం కలిగిన ప్రతి వ్యక్తి ఫార్మర్ రిజిస్టర్ చేసుకోవాలి ఏఈఓ

జోగులాంబ గద్వాల 19 మే 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : కేటి దొడ్డి తేదీ 19/05/2025 వ్యవసాయ శాఖ,జోగులాంబ గద్వాల జిల్లా ఈరోజు కేటి దొడ్డి మండలం చింతలకుంట రైతు వేదిక వద్ద కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పంట పొలాల కలిగిన ప్రతి రైతు - ఫార్మర్ రిజిస్టర్ చేయించుకోవాలని వ్యవసాయ విస్తరణాధికారి (Aeo) భరత్ సింహా రైతు సోదరులకు సూచించడం జరిగింది.. ముఖ్యంగా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనగా కేంద్ర ప్రభుత్వం పథకాలకు అమలకు ఆధార్ కార్డు తరహాలో రైతులకు 11 అంకెలతో విశిష్ట రైతుగుర్తింపు కార్డులను కేటాయించేందుకు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. భూమి కలిగిన ప్రతి రైతు కూడా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వ పథకలు అయినటువంటి పీఎం కిసాన్ (2000/రూపాయలు )మరియు పంట బీమా మరియు వ్యవసాయ పరికరాలకు మరియు యంత్రాలు అంతేకాకుండా ఎరువులు అందించడంలో ఈ ఫార్మా రిజిస్టర్ గుర్తింపు కార్డు ఉపయోగపడుతుందని రైతులకు ఏఈఓ తెలియజేశారు. ముఖ్యంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తదుపరి విడత నిధులు విడుదలకు ఫార్మర్ రిజిస్ట్రే ప్రమాణికంతీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు దారి చేయడం జరిగింది రైతులకు తెలియపరిచారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి రైతుబంధు రైతు బీమాకు ఎలాంటి సంబంధం లేదని.. ఈ ఫార్మా రిజిస్టర్ కొరకై తప్పనిసరిగా భూమి కలిగిన పాసుబుక్ ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉందో పైన తెలుపబడింది తీసుకొని వచ్చి వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద చేయించుకోవాలని రైతులకు తెలియపరచడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి భరత్ సింహా,గ్రామ రైతులు తదితరులుపాల్గొన్నారు.