పదోన్నతి ద్వారా పోలీసులకు గుర్తింపు తో పాటు విధులపట్ల ఉత్సాహం : జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐ.పి.ఎస్

May 19, 2025 - 20:50
 0  7
పదోన్నతి ద్వారా పోలీసులకు గుర్తింపు తో పాటు విధులపట్ల ఉత్సాహం : జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐ.పి.ఎస్

హెడ్ కానిస్టేబుల్ నుండీ  ఎ.ఎస్.ఐ గా పదోన్నతి పొందిన అధికారికి అభినందన.

జోగుళాంబ గద్వాల్ 19 మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : మల్దకల్ .*పోలీస్  స్టేషన్ లో పనిచేస్తు  హెడ్ కానిస్టేబుల్ నుండి ఎఎస్ఐ గా పదోన్నతి పొందిన డి .దేవయ్య ను *జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్  వారి కార్యాలయంలో అభినందించి వారి ర్యాంక్  పదోన్నతి చిహ్నంను అలకరించి  శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ....  పదోన్నతులతోనే పోలీసులకు గుర్తింపు తో పాటు, వీధుల పట్ల మరింత ఉత్సాహం వ‌స్తుంద‌ని అన్నారు . ఎలాంటి రిమార్క్ లేకుండా మిగిలిన సర్వీసును పూర్తి చేసి విధుల్లో మంచి పనితీరు కనబరిచి మరిన్ని పదోన్నతులు పొందాలని ఎస్పీ  ఆకాంక్షించారు. పోలీసు శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత పెరుగుతుందని, పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల మరింత నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా కృషి చెయ్యాలని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333