భువనగిరి గడ్డమీద కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం
ప్రధాని మోడీ వచ్చిన చామల గెలుపును ఆపలేరు
కెసిఆర్ లక్షల కోట్లు దోచుక తిన్నాడు
తెలంగాణలో బిఆర్ఎస్ దుకాణం బంద్ అయింది
కిరణ్ కుమార్ రెడ్డి వెనుక కోమటిరెడ్డి బ్రదర్స్ అండ
యువ నాయకుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత మన అందరిదీ
ఆదరించి గెలిపిస్తే ఐదు ఏళ్ళు సేవ చేస్తా
తిరుమలగిరి 15 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్ :- పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలలో భాగంగా భువనగిరి పార్లమెంటు పరిధిలోని తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం తిరుమలగిరి ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సభా అధ్యక్షత వహించారు .ముఖ్య అతిధులుగా భువనగిరి పార్లమెంటు ఇన్చార్జి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చామాల కిరణ్ కుమార్ రెడ్డి, ఏ ఐ సి సి సభ్యులు సరొత్తం రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే భువనగిరి పార్లమెంటు ఎన్నికల ఇన్చార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మనందరి ఆశా కిరణం యువకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అని, మన స్థానికుడు పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడ్డ వ్యక్తి అని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కెసిఆర్ ను గద్దె దింపుతామని చెప్పిన విధంగానే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సహకారంతో గద్దె దించినామన్నారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ లక్షల కోట్లు దోచుకుతిని రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందన్నారు. తెలంగాణలో బిఆర్ఎస్ దుకాణం బంద్ అయిందని, బిజెపి పార్టీ ఇక లేవదని అన్నారు. ప్రధానమంత్రి మోడీ వచ్చిన చామల గెలుపును ఆపలేరని గెలుపు తథ్యం అన్నారు. అదేవిధంగా ఖబర్దార్ జగదీశ్ రెడ్డి నీకు నీ బాస్ కేసీఆర్ కు అడ్రస్ లేకుండా చేస్తామన్నారు. పది సంవత్సరాలు తెలంగాణ పేరు చెప్పి కెసిఆర్ నువ్వు దోచుకున్న లక్షల కోట్లు కక్కిస్తాం జగదీష్ రెడ్డి అన్నారు.కిరాయి ఇంట్లో డొక్కు స్కూటర్ పైన తిరిగే నీకు వేల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు.ఉద్యమ కాలంలో సెంటిమెంట్ను రెచ్చగొట్టి మీరు విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకున్నారన్నారు. కిరాయి ఇంట్లో ఉన్న జగదీష్ రెడ్డి నాగారం లో పెద్డ కోట ఎలా కట్టిండని శంషాబాద్ లో 100 ఎకరాల తో ఫామ్ హౌస్ ఎలా కట్టిండని,దామోదర్ రెడ్డి కి ఎదురు నిలిచే ధైర్యం లేదు జగదీష్ రెడ్డికి అన్నారు. బిఆర్ఎస్ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులు లేరని, అన్నారు అదేవిధంగా కవిత తీహార్ జైల్లో బతుకమ్మ ఆడుతుందని నేను ఎప్పుడో చెప్పానన్నారు.
మేము తలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందన్నారు.మరో 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉంటుందన్నారు. మాకు పోటీ నల్లగొండ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి తోనే అన్నారు. అదేవిధంగా సూర్యాపేట, తుంగతుర్తి ఏరియాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి దామోదర్ రెడ్డి అన్నారు. చామల కుమార్ రెడ్డి ఒక్కడు కాదు ఆయన వెనక దామోదర్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలందరు ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ కులస్తుడైన మతస్థుడైన మాకు ఒక్కటేనన్నారు.
2018 లో మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను 12 మందిని తీసుకొని తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేసిండు కేసీఆర్ అన్నారు ఇష్టం వచ్చినట్టు పరిపాలన కొనసాగించి బంగారు తెలంగాణను అప్పుల పాలు చేసి చిప్ప చేతికి ఇచ్చిండు కేసీఆర్ అని అన్నారు. 10 ఏళ్లలో నీకు 1000 కోట్లు ఎలా వచ్చాయి జగదీశ్వర్ రెడ్డి అని ప్రశ్నిస్తూ అన్ని లెక్కలు బయటకి తీస్తామన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. అని మరో 20 ఏళ్లపాటు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలోనే ఉంటుందని, తుంగతుర్తిలో లక్ష ఓట్ల మెజారిటీ కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలన్నారు. అదేవిధంగా మే13వ తారీకు వరకు కష్టపడి ప్రతి కార్యకర్త ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను ప్రచారం చేసి విస్తృత స్థాయిలో తెలియపరచి భారీ మెజారిటీ తో కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలన్నారు. ఈనెల 21న పెద్ద ఎత్తున భువనగిరి లో కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ వేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తున్నారని కావున తుంగతుర్తి ప్రాంతం నుండి50 వేల మంది తరలి రావాలి అని ర్యాలీ చూసి భాజపా, బి ఆర్ ఎస్ పార్టీలకు మైండ్ బ్లాక్ కావాలన్నారు. మాజీ మంత్రివర్యులు టి పి సి సి సీనియర్ ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి చాల అదృష్టవంతుడని,యువ నాయకుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే బాధ్యత మనందరిపై ఉన్నదన్నారు. రాహూల్ గాంధీ ప్రధానమంత్రి ఐతే చామలా కిరణ్ కు సముచిత స్థానం వుండబోతుందన్నారు.పోరాటాల స్ఫూర్తి గడ్డా తుంగతుర్తి నియోజకవర్గం కిరణ్ గెలిచిన తరువాత ఈ ప్రాంతంలో వున్న కాంగ్రెస్ పార్టీ ని నమ్ముకున్న నాయకులని గుర్తుకి వుంచుకోవాలన్నారు నేను ప్రతిపక్ష నాయకునిగా ఈ ప్రాంతంలో వున్నాను అంటే కార్యకర్తలే నాధైర్యం అన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే రెట్టింపు మెజారిటీ ఇచ్చి పార్లమెంట్ తో కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించబోతున్నాంఅన్నారు.
తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలమైనదని గెలిచిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు అబీష్టం మేరకు పని చేయవలసిన అవసరం ఉందని కోరుతున్నానన్నారు. భువనగిరి పార్లమెంటు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదరించి గెలిపిస్తే 5 ఏళ్లు సేవ చేస్తానని కార్యకర్తలు, నాయకులు, మహిళా నాయకులు కష్టపడి గెలుపు దిశగా కృషి చెయ్యాలన్నారు.ఈ ప్రాంత వాసిగా శాలి గౌరారం లో జన్మించానన్నారు. మతోన్మాద శక్తులు మళ్ళీ అధికారం లోకి వస్తె మనం ఇబ్బంది పడాల్సి వస్తుందని ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకుండా 30 రోజులు కార్యకర్తలు శ్రమిస్తే అప్పుడు అధికారంలో లేకున్నా 11 నియోజకవర్గాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు ఎంత మెజార్టీ వచ్చిందో ఆ మెజార్టీ కంటే ఇప్పుడు ఎక్కువ రావాలి అన్నారు.ఈ కార్యక్రమంలో టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాల లక్ష్మి, సూర్యాపేట డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, డి సి సి ఉపాధ్యక్షులు యోగానంద చార్యులు, గుడిపాటి నరసయ్య,తిరుమలగిరి మున్సిపాలిటీ చైర్మన్ శ్రీమతి శాగంటి అనసూర్య రాములు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండలాల అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.