విద్యార్ధులు ఉన్నత లక్ష్యాల పై దృష్టి సారించాలి
జోగులాంబ గద్వాల 29 ఆగస్టు 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- విద్యార్థినిలు ఉపాధ్యాయుల సూచనలూ పాటిస్తూ ఉన్నత లక్ష్యాల పై దృష్టి పెట్టాలని, ఏలాంటి ఆకర్షణలకు గురి కావద్దని, ఏలాంటి వేదింపులకు నిరాదరణకు గురైన బాధిత మహిళలు, బాలికలు మౌనం వీడి నిర్భయంగా పోలీసుల దృష్టికి లేదా భరోసా కేంద్రం దృష్టికి తీసుకొచ్చి వేధింపుల నుండి బయట పడాలని భరోసా కేంద్రం కో ఆర్డినేటర్ శివాని అన్నారు. తెలంగాణ పోలీసు విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రములో నడుపబడుతున్న బరోసా సెంటర్ బాదిత మహిళలకు అందిస్తున్న సేవల గురించి జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు ఆదేశాల మేరకు గురువారం గోనుపాడు కేజీబీవీ పాఠశాల విద్యార్థినులకు అవగహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యార్థినిలు మంచిగా చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని, అందుకు ఉపాధ్యాయుల సూచనలు పాటించాలని అన్నారు . విద్య ప్రాముఖ్యత గురించీ తెలియజేసి బాల్య వివాహాలు, మూడ నమ్మకాల వల్ల కలిగే నష్టాల గురించి వివరించారు. మహిళల హక్కులు, సాధికారత, మొబైల్స్ వినియోగం దుర్వినియోగం గురించి తెలియజేశారు.యుక్త వయస్సు లో వచ్చే ఆకర్షణలు , వాటిని అధిగమించడం గురించి వివరించారు. మహిళ సాధికారత, తల్లి తండ్రుల ప్రాధాన్యత,, పో క్సో కేసుల నమోదు, శిక్షల గురించి తెలియజేశారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి, విపత్కర పరిస్థితుల్లో ఆత్మరక్షణ పొందడం గురించి, అత్యవస పరిస్థితులలో వినియోగించే డయల్ -100& 1098 గురించి విద్యార్థులకు అవగహన కల్పించారు.అనంతరం భరోసా కేంద్రం ద్వారా వేదింపులకు గురయ్యే బాధితులకు వైద్య, న్యాయపరమైన సహాయం పొందే విధానాన్ని వివరించారు. విద్యార్థినిలు ఏలాంటి వేదింపులకు గురైన వెంటనే డయల్ -100 లేదా భరోసా కేంద్రం నం 63039,23257 కు పోన్ చేసి సమచారం అందించాలని వేధింపుల నుండి బయట పడాలని, బాదితుల వివరాలు గోప్యంగా ఉంచబడుతయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, భరోసా సిబ్బంది కీర్తీ,విద్యార్థినిలు పాల్గొన్నారు.