భారత రత్న డా.భీంరావ్ రాంజీ అంబేడ్కర్ 134 వ జయంతి
క్రైస్తవులకు బైబిల్ తోపాటు రాజ్యాంగం ను బోదించాలి
బిషప్. డా.దుర్గం ప్రభాకర్
తెలంగాణా రాష్ట్ర క్రైస్తవ నాయకులు రెవ. డా. జలగం జేమ్స్
సూర్యాపేట పాస్టర్స్ పెలోషిఫ్ నియోజకవర్గ అధ్యక్షులు
ఏప్రిల్ సోమవారం 14: ఆత్మకూర్ (యస్) డబ్ల్యూ. యం. ఇ షాలెం చర్చ్ నందు సూర్యాపేట నియోజకవర్గ పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు, స్థానిక పాస్టర్ రెవ. డా.జలగం జేమ్స్ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత, విశ్వ జ్ఞాన యోధుడు ,ప్రపంచ మేధావి, భారత ముద్దు బిడ్డ డా.బి.ఆర్. అంబేడ్కర్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన చిత్ర పాఠనికి పూల మాల వేసి ఘనంగా జయంతినీ నిర్వహించి, స్విట్స్ పంచిపెట్టినారు. ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిధిగా తెలంగాణా రాష్ట్ర క్రైస్తవ నాయకులు బిషప్ దుర్గం ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ భీంరావ్ రాంజీ అంబేద్కర్ (డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ) (1891 ఏప్రిల్ 14 - 1956 డిసెంబరు 6) ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడనీ. అతను స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా, రాజ్యాంగ శిల్పి, భారత రత్న వారు దేశానికి చేసిన సేవా మరువలేనిది అనీ, రాజ్యాంగం లోని ఆర్టికల్ వ్యక్తిగత స్వేచ్ఛలు, హక్కులు: ప్రకరణ 19 నుంచి 22 వరకు ఉన్న హక్కులను వివిధ స్వేచ్ఛల రూపంలో పొందుపర్చారనీ. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛలు చాలా విలువైనవి అనీ. కానీ ఈ స్వేచ్ఛలపై హేతుబద్ధమైన పరిమితులను విధించవచ్చు అనీ, అధికరణం 19లో ఆరు వ్యక్తిగత స్వేచ్ఛలు ఉన్నాయనీ, ప్రకరణ 19 (1)ఎ. వాక్ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ, అభిప్రాయ ప్రకటన బి. శాంతియుతంగా, ఆయుధాలు లేకుండా సమావేశాలు నిర్వహించడం సి. సంస్థలు, సంఘాల ఏర్పాటు. సహకార సంఘాల ఏర్పాటు, నిర్వహణ డి.దేశవ్యాప్త సంచార స్వేచ్ఛ
ఇ.దేశవ్యాప్త స్థిర నివాస స్వేచ్ఛ మొట్టమొదటిది 25వ అధికరణం,ప్రజా భద్రత, నైతికత ఆరోగ్య విషయాలకు లోబడి – మత స్వాతంత్య్రమూ, మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించే, ఆచరించే, ప్రచారం చేసే హక్కు అందరు వ్యక్తులకూ సమానంగా ఉండును అననీ 25వ అధికరణంలో మొదటి క్లాజు పేర్కొంటుందనీ,బాబాసాహెబ్ అంబేడ్కర్ అధ్యక్షతన డ్రాఫ్టింగ్ కమిటీ రూపొందించిన రాజ్యాంగం తొలి ముసాయిదాలో మత ప్రచారం హక్కు మత స్వాతంత్రానికీ, మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించి, ఆచరించడానికీ పౌరులందరికీ సమాన హక్కు ఉంటుందని, అదే తొలి ముసాయిదాలో ఉన్నదనీ.రాజ్యాధికారం ప్రకారం మతస్వేచ,భావ స్వేచ, హక్కులను చట్టం లో పొందు పర్చి సార్వభౌమధి కారాన్ని, లౌకిక ప్రజా స్వామ్యంగా నెలకొల్పిన మహానీయుడు డా. బిఆర్. అంబేద్కర్ అనీ, ప్రతి పాస్టర్ క్రైస్తవ భక్తులకు బైబిల్ తోపాటు రాజ్యాంగంను కూడా అవగాహనా కొరకు బోదించాలని అన్నారు. ఈ కార్యక్రమం లో సూర్యాపేట రూరల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెవ. ఏర్పుల క్రీస్థోఫర్, రెవ. డా. పంది మార్క్,రెవ. తడంన్కి కిరణ్ బాబు, రెవ. బానోత్ సుధాకర్, పాస్టర్ బొల్లెద్దు మోజెస్, పాస్టర్ రెడ్డిపల్లి ప్రేమ్ సాగర్,మేరుగు వెంకన్న, సన్నీ పాల్, జలగం రాజు,పాస్టర్ నకిరేకంటి సైమన్, పాల్వాయి అజయ్ తదితరులు పాల్గొన్నారు.