నేటి తరం అంబేద్కర్ను మార్గదర్శకంగా తీసుకోవాలి.
అణగారిన వర్గాల గొంతుకగా హక్కులు సాధించి పెట్టినఅంబేద్కర్ కృషి తరతరాలకు స్ఫూర్తినివ్వాలి.

కార్మికులు మహిళలు చేతివృత్తుల వాళ్ళు పేదలు అణగారిన వాళ్లు ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం తన జీవితమంతా ధారబోసి రాజ్యాంగాన్ని రచించి చట్టబద్ధంగా ఫలాలను అందించిన దార్శనికుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఎన్నో రంగాలను ప్రభావితం చేసిన ఆయన కేవలం రాజ్యాంగం నిర్మాతగానే గాక అందరివానిగా గుర్తించాలని అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కవి రచయిత వడ్డపల్లి మల్లేశం ప్రజలను కోరారు. ఇప్పటికీ దళిత కుటుంబంలో పుట్టిన అంబేద్కర్ అంటే కొన్ని వర్గాలకు చిన్న చూపేనని కానీ ఆయన ప్రతిభ అంతర్జాతీయ స్థాయిలో గుర్తించబడిందని అందుకు గుర్తుగానే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచ విజ్ఞాన దినోత్సవం నిర్వహించడం గర్వకారణమని ఆయన అన్నారు. హుస్నాబాద్ లో 14 ఏప్రిల్ 2025 సోమవారం రోజున డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలలో ప్రసంగించిన వడ్డేపల్లి మల్లేశం స్వాతంత్రానికి పూర్వమే సంక్షోభంలోకి నెట్టబడినటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి రూపాయి విలువ గురించినటువంటి రచనలు చేయడంతో పాటు రిజర్వ్ బ్యాంకు యొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పిన కారణంగా 1935, ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంకు ప్రారంభించబడినదని దానికి మూలకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని గుర్తించడం అవసరం అని అన్నారు. చట్టబద్ధంగా హక్కులు రాజ్యాంగంలో వివిధ వర్గాలకు పొందుపరిచినప్పటికీ ఆ హక్కులను కాపాడే విషయంలో పాలకులు చిత్తశుద్ధిని ప్రదర్శించక నిర్లక్ష్యం వహిస్తే ప్రజలే పాలకులకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించిన వైతాళికుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఆయనను కొనియాడారు. ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాజ్యాంగాను సారం పరిపాలన కొనసాగించినట్లయితే కొంతవరకైనా ప్రజలకు మేలు జరుగుతుందని కొద్దిమంది చేతుల్లో సంపద కేంద్రీకృతం కాకూడదని ఆదేశిక సూత్రాలలో అంబేద్కర్ రాసిపెట్టినప్పటికీ 40 శాతం సంపద కేవలం ఒక్క శాతం సంపన్న వర్గాల చేతిలో ఉండడం సిగ్గుచేటని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. .సమానత్వము, మత స్వేచ్ఛ, భావవ్యక్తీకరణ వంటి అంశాలకు సంబంధించి ప్రాథమిక హక్కుల్లో పొందుపరిచిన అంశాలు ఇవ్వాలా ప్రజలకు కీలకమైనవని ఎస్సీ ఎస్టీలకు అవకాశం కల్పించిన రిజర్వేషన్ల స్ఫూర్తితో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీ వర్గాలకు కూడా విద్యా ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలతో పాటు చట్టసభల్లో వారి వాటా మేరకు రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగబద్ధమని అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
వడ్డేపల్లి మల్లేశం
రాజకీయ సామాజిక విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్