భర్త పెట్టే బాధను తట్టుకోలేక తల్లి బిడ్డ మిస్సింగ్

గార్ల 29 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:– కట్టుకున్న భర్త తాగుడుకు బానిసైన భర్త పెట్టే గొడవలు భరించలేక వివాహిత కూతురితో పాటు అదృశ్యమైన సంఘటన గార్ల మండలంలో చోటుచేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం బాధితురాలు అక్క రేణుక బయ్యారం మండలం గౌరారం గ్రామానికి చెందిన తమ తండ్రి కందుకూరి వీరభద్రం తన చెల్లెలు సుమలత (35)ను గార్ల మండలం రాంపురం గ్రామానికి చెందిన ఎల్మకంటి కనకయ్య కుమారుడు ఎల్మకంటి శ్రీనుకు 15 సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిపించారని వారికి సంతానం ఒక కుమార్తె సాహితి (11) సంవత్సరాలు ఉందని సజావుగా సాగిన వీరి వైవాహిక జీవితంలో గత కొంత కాలం నుండి మద్యానికి బానిసైన తన మరిది యలమకంటి శ్రీను (పెయింటర్)తన చెల్లెలను మానసికంగా శారీరకంగా చిత్ర హింసలు పెడుతున్నాడని మాకు తెలపడంతో గతంలో కూడా పలుమార్లు పెద్దల సమక్షంలో ఇరువురికి సర్ది చెప్పే చెప్పామని ఐనా తన మరిది పద్ధతి మార్చుకోకుండా మద్యానికి బానిసై తన చెల్లెలను ఇబ్బంది పెట్టడంతో ఈనెల 25 శుక్రవారం తన కుమార్తెతో పాటు అదృశ్యమైనట్లు మాకు ఆదివారం 27న తెలియడంతో బంధువుల మిత్రుల ఇండ్లలో వెతికినా వారి ఆచూకీ తెలియలేదని మహబూబాబాద్ పట్టణానికి చెందిన ముత్యాల రేణుక సోమవారం 28న గార్ల పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గార్ల ఎస్సై షేక్ రియాజ్ పాష తెలిపారు.