బైక్ అదుపుతప్పి యువకుడు దుర్మరణం

Oct 14, 2025 - 13:22
Oct 14, 2025 - 13:24
 0  7

అడ్డగూడూరు14 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– 

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని చిర్రగూడూరు గ్రామ శివార్లలోని ఇండియన్ పెట్రోల్ పంప్ సమీపంలో అనంతారం బ్రిడ్జి ముందు రోడ్డు ప్రమాదం జరిగిందని స్థానికులు 100 ఫోన్ చేయగా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తుండగా

సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన కుంబం రాజు తండ్రి రామ్మూర్తి వయసు 29 సంవత్సరాలు వృత్తి కారు డ్రైవర్ కులం గౌడ్ వ్యక్తి తన టు వీలర్ వెహికల్ నెంబర్ టీజీ29 7335 తో పాటు రోడ్డుపై పడిపోయినట్లు గుర్తించారు.బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుడి జేబులో దొరికిన మొబైల్ ఫోన్ ద్వారా అతని తల్లిదండ్రులకు సమాచారం అందించడం జరిగింది.తదుపరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ప్రాథమిక విచారణలో మృతుడు భువనగిరిలో తన స్నేహితుడి అంత్యక్రియలకు హాజరై,తన స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగి,మరణించాడని తేలింది.మృతునికి ఒక కుమారుడు 6 సంవత్సరాలు కుమార్తె 3 సంవత్సరాలు

కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.