బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు దుర్మరణం

Mar 19, 2025 - 18:32
 0  4
బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు దుర్మరణం

జోగులాంబ గద్వాల 19 మార్చి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: ఇటిక్యాల.  కోదండపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఇద్దరు మృతిచెందారు. మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన బాష, ఎలీషా అనే ఇద్దరు వ్యక్తులు బైక్‌పై హైదరాబాద్‌ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున కొదండపురం సమీపంలో జాతీయ రహదారి 44పై కర్నూల్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వస్తున్న కారు.. వారి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన వారిద్దరు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333