బునాదిగాని కాల్వపనులు వెంటనే చేపట్టాలి

సిపిఐ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే పల్ల వెంకట్ రెడ్డి

Nov 5, 2024 - 16:59
 0  52
బునాదిగాని కాల్వపనులు వెంటనే చేపట్టాలి

అడ్డగూడూరు 5 నవంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- అడ్డగూడూరు:బునాదిగాని కాల్వకు నిధులు మంజూరు చేసి వెంటనే పనులు చేపట్టాలని సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం అడ్డగూడూరు మండల కేంద్రంలో సిపిఐ నాయకులు చెడిపల్లి రవీందర్ అధ్యక్షతన జరిగిన మండలకౌన్సిల్ ముఖ్యకార్యాకర్తల సమావేశంలో ముఖ్య అథితులుగా సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బునాదిగాని కాల్వకోసం నిధులు విడుదల జీఓ ఇచ్చారు. నిధులు విడుదల చేసి పనులు వెంటనే చేపట్టాలని కోరారు. రైతు బరోస డబ్బులు రైతులఖాతాలో జమ చేయాలని, రైతులకు ఏషరతు లేకుండా 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 
పేద విద్యార్థుల చదువుల కోసం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు జమచేయాలని,సంక్షేమ పథకాలు పేదలకు అందేవిధంగా చూడాలని ఇందిరమ్మ ఇళ్లు నిరుపేదలైన లబ్ధిదారులకు అందజేయాలని కోరారు.రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంకు సిపిఐ మద్దతుగా నిలిచి ప్రభుత్వం ఏర్పాటు సహకరించిందని అన్నారు.అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో సలహాలు సూచనలు ఇస్తూ కాంగ్రెస్ పార్టీని నిర్మాణాత్మకంగా విమర్శ చేయడం జరుగుతుందని అన్నారు.ఈకార్యక్రమంలో సి పి ఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు,సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, సి పి ఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చేడే చంద్రయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతికుమార్,సిపిఐ మండల కార్యదర్శి చేడే బిక్షం,వ్యవసాయ జిల్లా కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జిట్ట రాములు,వివిధ గ్రామాల గ్రామ శాఖ కార్యదర్శులు సోలిపురం నాగిరెడ్డి,రేఖల శ్రీనివాస్, కందుకూరి వెంకన్న ,బొనగ సుదర్శన్ రెడ్డి ,బెల్లి శ్రీకాంత్,గూడెల్లి యాదయ్య, సుక్క సోమయ్య, గొలుసుల శ్రీకాంత్, పోగుల కనకయ్య, యాట రామచంద్రు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333