బిల్లు చెల్లించిన మోటారు స్టార్టర్ ఇవ్వని విద్యుత్ అధికారులు

Dec 21, 2024 - 17:57
Dec 22, 2024 - 12:57
 0  1

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ బిల్లును చెల్లించిన స్టార్టర్లు ఇవ్వని విద్యుత్ అధికారులు ఆన్లైన్లో బిల్లులు కడితే మేమున్నవెందుకు అంటున్న అధికారులు... వ్యవసాయ మోటార్ల రైతుల స్టాటర్లు తీసుకెళ్తున్న అధికారులు. బిల్లు కట్టిన మామూలు ఇవ్వాలంటూ రైతులను వేధింపులు... ఆత్మకూర్ ఎస్... రైతు రాజ్యం అని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు రైతుల ఓట్లను ఆకర్షించే క్రమంలో ఒకవైపు ఊక దంపుడు ఉపన్యాసాలు ఇస్తూ మరోవైపు బిల్లులు వసూలు చేయాలంటూ విద్యుత్ అధికారులను రైతుల మీదికి దాడుల కు ఉసిగొల్పుతున్నారు. ఇదే అదును గా రైతులు బిల్లును చెల్లించిన విద్యుత్ మోటార్ల స్టార్టర్లు ఎత్తుకెళ్లి మామూలు ఇవ్వనిదే స్టార్టర్లు ఇవ్వని సంఘటన ఆత్మకూరు మండలం పాతర్ల పాడు గ్రామంలో గత మూడు రోజులుగా కొనసాగుతుంది. ఒక ట్రాన్స్ఫర్ పై 20 కనెక్షన్లు ఉండగా అందులో సగానికి పైగా అక్రమ కనెక్షన్లు దర్శనమిస్తున్నాయి. అక్రమ కనెక్షన్ల వారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బిల్లును చెల్లించకుండా అధికారులకు నెల మామూలు ఇవ్వడంతో వారి కనెక్షన్ తొలగించకుండా రెగ్యులర్ గా బిల్లు చెల్లించే వారినిచేతి వాటం కోసం వేధిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. గత రెండు రోజులుగా పాతర్లపాడు గ్రామంలో హరిబాబు అనే రైతు కు చెందిన రెండు స్టార్టర్లను తొలగించి తీసుకెళ్లిన విద్యుత్ అధికారులు శనివారం రైతు ఆన్లైన్లో బిల్లులు చెల్లించినప్పటికీ ఆన్లైన్లో బిల్లు చెల్లిస్తే మాకు రావాల్సిన మామూలు సంగతి ఏమిటి అని స్టార్టర్ ఇవ్వకుండా వేధిస్తున్నట్లు రైతు హరిబాబు ఆరోపించాడు. గ్రామంలో ప్రతి ట్రాన్స్ఫార్మర్ కు ఏళ్ల తరబడి అక్రమ కనెక్షన్లు కొనసాగుతున్నాయని ఇవన్నీ అధికారులకు చేతివాటాలతో నిర్వహిస్తున్నారని ఇది అడిగినందుకే ఇబ్బందిగా గురి చేస్తున్నారనీ హరిబాబు ఆరోపించారు. ఉన్నతాధికారులు గ్రామంలో పర్యటించి అక్రమ కనెక్షన్ లపై చర్యలు తీసుకొని సక్రమంగా బిల్లులు చెల్లించే రైతుల ను ఆదుకోవాలని కోరారు.