బాధిత కుటుంబానికి అండగా చిన్ననాటి స్నేహితులు

Apr 2, 2026 - 07:12
 0  204
బాధిత కుటుంబానికి అండగా చిన్ననాటి స్నేహితులు

తిరుమలగిరి 02 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

తోటి స్నేహితుడు ఇటీవల మరణించడంతో అతనితో చదువుకున్న చిన్ననాటి స్నేహితులు ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు. తమకు తోచినంత సహాయాన్ని అందించి ఇంకా మానవత్వం ఉందని ఆ స్నేహితులు నిరూపించారు. కష్టకాలంలో కుటుంబానికి సహాయం చేసిన సదరు స్నేహితుల ఆధ్వర్యంలో బాధిత కుటుంబంతో పాటు వారిని గ్రామస్తులు అభినందించారు. వివరాలలోకి వెలితే .. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన ఖమ్మం పాటి రాజు గౌడ్ (35) మరణించాడు మృతునికి భార్య రేణుక తో పాటు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు తమ కుటుంబాన్ని పోషిస్తూ రాజు గౌడ్ ఎంతో ఆనందదాయకంగా ఉన్న సమయంలో మరణించడంతో 

 అతని కుటుంబం ఆర్థికంగా చితికి పోవడంతో ఆపదలో ఉందని తెలుసుకొని అతనితో అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006-07 బ్యాచ్ చదువుకున్న తోటి మిత్రులు మానవతా దృక్పథంతో సహాయం అందించి ఆదుకోవాలని సంకల్పించారు. పదవ తరగతి చదువుకున్న మిత్రులు అందరూ కలిసి తమకు తోచినంత విరాళాన్ని ప్రోగు చేశారు. సుమారు రూ. 11000 డబ్బులు జమ చేసి భార్యకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎర్రగట్టు మహేష్, గోల్కొండ సైదులు ,నరసింహ లింగయ్య ,మహేష్ ,గణేష్, లక్ష్మణ్, ముత్తయ్య ,శోభన్ బాబు, శీను ,రామాంజనేయులు, పరశురాములు ,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి