బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శిగా మందుల నాగరాజు

అడ్డగూడూరు 12 జూలై 20 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించిన సందర్భంగా అడ్డగూడూరు మండలం చౌళ్ళరామారం గ్రామానికి చెందిన మందుల నాగరాజ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శిగా బహుజన సమాజ్ పార్టీ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ దాగిల్ల దయానంద రావు సమక్షంలో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు బాసాని మహేందర్ ను నియమించడం జరిగింది.ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా జోనల్ కోఆర్డినేటర్ కొంగరి బాలరాజు(పెరియార్)జిల్లా ఇంచార్జ్ గంధమల్ల లింగస్వామి ఆలేరు,భువనగిరి పార్టీ నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు.కార్యదర్శిగా నియమితులైనందుకు మందుల నాగరాజు అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలిపారు.