రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ మంత్రి ఉత్తమ్

సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం.....
రేషన్ కార్డు ల జారీ నిరంతర ప్రక్రియ........
తుంగతుర్తి నియోజకవర్గం ను ఎవరు ఊహించని విధంగా అభివృద్ధి చేస్తా...
స్వతంత్ర భారతదేశం లో సన్న బియ్యం పంపిణిని మించిన సంక్షేమ పథకం లేదు.
నూతన రేషన్ కార్డుల పంపిణి ప్రారంభోత్సవ కార్యక్రమం కి వేలాదిగా తరలిరావాలి.....
పేదవారికి సంక్షేమ పథకాలు అందించటమే ప్రభుత్వ ధ్యేయం
తిరుమలగిరి 12 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తుందని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం తిరిమలగిరి నందు జూలై 14 న సి ఎం చేతుల మీదుగా నూతన రేషన్ కార్డులు పంపిణి ప్రారంభోత్సవవం చేసే సభ పై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, తుంగతుర్తి ఎ మ్మెల్యే మందుల సామెల్, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి,ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జి మంత్రి అడ్లురు లక్ష్మణ్ కుమార్ లతో కలిసి రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి యన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత 100 సంవత్సరాలలో భారతదేశం లోని ఏ రాష్ట్రము చేయని బి సి కులగణన 1.04 లక్షల ఎన్యూమరేటర్ల ద్వారా సేకరించి విజయవంతం చేశామని ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేసి, బి సి లకి స్థానిక సంస్థ ఎన్నికలలో 42 శాతం అమలు కొరకు చట్టం తెచ్చామని,జూలై 10 న నిర్వహించిన క్యాబినెట్ సమావేశం లో బి సి లకి 42 శాతం స్థానిక సంస్థ ఎన్నికల్లో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అలాగే ప్రజల కోరిక మేరకు ఎస్ సి వర్గీకరణ చేశామని బి సి కులగణన,ఎస్ సి వర్గీకరణ అనే రెండు క్యాబినెట్ సబ్ కమిటిలకి చైర్మన్ గా నేనే వ్యహరించానని తెలిపారు. జూలై 14 న 5 లక్షల కార్డులు నూతనంగా ఇవ్వబోతున్నామని, అదనంగా కుటుంబ సభ్యులని రేషన్ కార్డులలో చేర్చుతున్నామని 13000 కోట్ల రూపాయలు ద్వారా 3.10 కోట్ల మందికి 6 కేజీల సన్నబియ్యం ఉచితంగా ఇచ్చి 95 లక్షల కుటుంబాలకి చెందిన పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టి ఆకలి తీర్చటం,అర్హులందరికీ రేషన్ కార్డుల ఇవ్వటం అనేవి నాకు చాలా సంతోషం, సంతృప్తి ని ఇచ్చాయని ఇలాంటి పేదవారికి ఆహార భద్రత కల్పించే సంక్షేమ పథకాలు స్వతంత్ర భారత దేశంలోనే లేవని తెలిపారు.గత పాలకులు ఉప ఎన్నికలు ఉన్నప్పుడే రేషన్ కార్డులు ఇచ్చారని కానీ మేము అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని, రేషన్ కార్డులు జారీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు.సన్న బియ్యం ద్వారా పేదల ఆకలి తీర్చేందుకు రైతులకి 500 బినస్ ఇచ్చి, మిలర్ల ద్వారా మర ఆడించి సన్న బియ్యం సేకరిస్తున్నామని గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యం దుర్వినియోగం అయ్యాయని తెలిపారు. ఖరీఫ్, రభీ సీజనలలో 281 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించిభారతదేశం లోనే తెలంగాణ అగ్రగామిగా నిల్చిందని యాసంగి సీజన్ లో చివరి గింజ వరకు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని అన్నారు. ధాన్యం సేకరణ,సన్న బియ్యం పంపిణి,రేషన్ కార్డులు జారీ లాంటివి ప్రజలకి ఇచ్చి గ్రామీణ రైతులు బాగుండాలని తెలంగాణ సస్యాశ్యామలం అయ్యేలా ఈ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. జూలై 14 న వీరులు పుట్టిన పోరాటాల గడ్డ తుంగతుర్తి గడ్డ నుండి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు చేతులు మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణి చేసే బహిరంగ సభకి వేలాదిగా ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని అన్నారు. తుంగతుర్తి నియోజవర్గం బి యన్ ఆర్ లాంటి గొప్ప వీరులు జన్మించిన గడ్డ అని, తెలంగాణ సాయుధ పోరాటం లో భూమి, నీరు కోసం పోరాడిన వీరులెందరో పోరాడినారని అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని మీ ఎ మ్మెల్యే మందుల సామెల్ ప్రతి రోజు రోడ్లు, ఇంటిగ్రేటెడ్ స్కూల్, కాలేజీ లు, నీటి పారుదల ప్రాజెక్ట్ లు కొరకు నిరంతరం కృషి చేస్తున్నాడని గతంలో ఎన్నడూ లేని విధంగా కనివిని రీతిలో తుంగతుర్తి అభివృద్ధి చేసేందుకు నా వంతు సహాయం తప్పకుండ ఉంటుందని ఈ సందర్బంగా మంత్రి తెలిపారు. తదుపరి ఇంచార్జి మంత్రి అడ్లురు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గత పాలకులు పేదల సంక్షేమం కోసం ఎ పథకం చేయలేదని, పేదవారికి నూతన రేషన్ కార్డులు ఇవ్వలేదని అన్నారు. కానీ ప్రజా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పేదల సంక్షేమం కోసం కృషి చేస్తుందని జూలై 14 న మధ్యాహ్నం 3:00 గంటలకి జరిగే నూతన రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమాన్ని అందరు సమన్వయము చేసుకుంటూ ఎవరు ఊహించని విధంగా విజయవంతం చేయాలని సూచించారు. ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ బి సి లకి 42 శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు తెలుపుతూ జూలై 14 న నూతన రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమానికి 9 మండలాలు, 2 మున్సిపాల్టీలు,154 గ్రామ పంచాయతీలనుండి 70,000 మంది తరలివచ్చి సభ ని విజయవంతం చేయాలని తెలిపారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ భారత దేశం లో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు తెలంగాణ లో అమలు జరుగుతుందని తెలిపారు. కృష్ణ, గోదావరి జలాలు గురించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిపిటి ద్వారా వివరించి గత పాలకుల వల్ల తెలంగాణ ప్రజలకి అర్ధం అయ్యేలా వివరించారాని అన్నారు. ఆనకట్టలు అనగానే కాటన్ దొర, కే ఎల్ ఆర్ పేర్లు గుర్తు వచ్చినట్టు పెట్టినట్టు ఎత్తి పోతల పథకాలు అనగానే రాబోయే రోజుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు గుర్తు ఉండేలా నిర్మిస్తున్నారని అన్నారు. ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నూతన రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేయాలని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ చెవిటి వెంకన్న యాదవ్ మాట్లాడుతూ నాడు దేశ రక్షకుడిగా,తెలంగాణ సంరక్షడిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరంతరం పని చేస్తున్నాడని ఈ ప్రాంత కన్న బిడ్డగా పేదవారు ఆకలితో ఇబ్బంది పడుతున్నారని సన్నబియ్యం పంపిణి హుజూర్నగర్ నుండి రేషన్ కార్డుల తిరుమలగిరి నుండి ప్రారంభిస్తునందుకు మంత్రికి ధన్యవాదములు తెలిపారు. ఈ సమావేశం లో జిల్లా ఎస్పి కే నరసింహ, అదనపు కలెక్టర్ పి రాంబాబు, డిఆర్డీఓ వివి అప్పారావు, డిఎఫ్ఓ సతీష్ కుమార్, డియస్ఒ మెహన్ బాబు, ఆర్డీఓ వేణు మాధవరావు, తహసీల్దార్ హరి ప్రసాద్, అధికారులు, ప్రజా ప్రతినిధులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.