బతుకమ్మ పాటల తో నిరసన తెలిపిన యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర శిక్షణ ఉద్యోగులు
పాల్గొన్న అడ్డగూడూరు మండల కోర్డినేటర్ బాలెంల కళ్యాణి
అడ్డగూడూరు 13 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం లోని కలెక్టర్ కార్యలయం ముందు గత ఎనిమిది రోజులుగా యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర శిక్షణ ఉద్యోగులు నిరసన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ సంస్కృతి సంప్రదాయం ప్రకారంగా బతుకమ్మలు చేసి మేము ఎట్లా బతకాలి మా బతుకులు ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే మా కుటుంబాలు బాగుపడతాయి అని ఆట పాటలతో నిరసన తెలిపారు.ఈ సందర్బంగా అడ్డగూడూరు మండల సమగ్ర శిక్షణ ఉద్యోగుల అడ్డగూడూరు మండల కోర్డినేటర్ బాలెంల కళ్యాణి మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మ్యానిఫేస్టో లో సమగ్ర శిక్షణ కాంట్రాక్టు ఉద్యోగులను మేము అధికారం లోకి వచ్చిన వెంటనే పర్మనెంట్ చేస్తాము అని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చి సంవత్సరా కాలం గడిచిన మమ్ముల్ని ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించకపోవడం సరైంది కాదని అన్నారు మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయకపోతే రానున్న రోజుల్లో మా యొక్క పోరాటం ఉదృతం చేసి మా సత్తా ఏమిటో చూపిస్తమని అడ్డగూడూరు మండల సమగ్ర శిక్షణ ఉద్యోగుల కోర్డినేటర్ బాలెంల కళ్యాణి తెలంగాణ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఇప్పటికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈ ప్రభుత్వం తమ గౌరవాన్ని కాపాడుకోవాలి సమగ్ర శిక్షణ ఉద్యోగుల జీవితాలతో అడ్డుకోవద్దు అని అన్నారు