ప్రియాంక మృతికి కారకులైన వారి పై కఠిన చర్యలు తప్పవు

Oct 4, 2025 - 18:51
 0  25
ప్రియాంక మృతికి కారకులైన వారి పై కఠిన చర్యలు తప్పవు

జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐ.పి.ఎస్

 జోగులాంబ గద్వాల 4 అక్టోబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల దళిత మహిళ ప్రియాంక మృతికి కారకులైన వారి పై కఠిన చర్యలు తప్పవని, అందుకు బాద్యులైన వారిని  చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐ.పి.ఎస్  తెలిపారు. గట్టు మండలం చిన్నోని పల్లి గ్రామానికి చెందిన రఘునాథ్ గౌడ్  (PC-2620) తాను చదువుకునే దగ్గర ప్రేమించిన దళిత అమ్మాయి ప్రియాంక ను, ప్రేమ పేరుతో, శారీరకంగా వాడుకొని,  పెళ్లి చేసుకోవడం లేదని చిన్నోని పల్లి గ్రామానికి వచ్చి గట్టు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు ఇవ్వగ గట్టు పోలీస్ స్టేషన్ లో తేది:17.07.2025 నాడు క్రైమ్ నెంబర్ 104/2025 u/s 493 IPC, 318(2),318(4),115(2) r/w 3(5)BNS గా కేసు నమోదు చేసి విచారణ  అనంతరం  69 BNS & 3(2)(v) అఫ్ SC/ST (POA) ఆమెండెంట్ యాక్ట్ -2015 గా సెక్షన్ ఆల్ట్రేషన్ చేసి  తేది:31.07.2025 నాడు నిందితుడు రఘునాథ్ గౌడ్ ను రిమాండ్ చేస్తూ, విధుల నుండి సస్పెండ్ చెయ్యడం జరిగింది. ప్రస్తుతం ప్రియాంక మృతికి కారకులైన వారి పై కూడ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఎంతటి వారు ఉన్న ఉపేక్షించేది లేదని మరియు సస్పెండ్ అయినా కానిస్టేబుల్ రఘునాథ్ గౌడ్ ను పర్మినెంట్ గా  పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం నుండి తొలగిస్తున్నట్లు(డిస్మిస్ చేస్తున్నట్లు)  జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు, ఐ పి ఎస్ తెలిపారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333