ప్రమాదవశాత్తు ఆటో బోల్తా.

జోగులాంబ గద్వాల 28 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. మండలం పుటాన్ పల్లి స్టేజీ సమీపంలో ఓ గుర్తు తెలియని ఆటో అదుపుతప్పి రోడ్డుపైన బోల్తా పడింది. గద్వాల పట్టణంలోని వివిధ హోటలలో మిగిలిఉన్న అన్నాన్ని వరాహల కోసం సేకరించి బొలెరో వాహనం ద్వారా ఎర్రవల్లికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న గద్వాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో బొలెరో వాహనాన్ని పక్కకు పెట్టారు. దీంతో వాహనాల రాకపోకులకు ఎలాంటి ఇబ్బందులు జరగలేదు.