చిన్నంబావి మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

Jun 28, 2024 - 20:13
Jun 28, 2024 - 20:39
 0  118
చిన్నంబావి మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్  సురభి

28-06-2024 తెలంగాణవార్త ప్రతినిధి చిన్నంబావి మండలం. చిన్నంబావి మండలంలో వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పర్యటించారు. ఫ్రైడే డ్రై డే సందర్భంగా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నీటి తోట్లు శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు.

 అదేవిధంగా ఇండ్ల పైకి ఎక్కి పరిసరాల్లో ఉండే ఇండ్లను పరిశీలిస్తూ ఆ ఇండ్లపై నీటితోట్లు కానీ కుండలు  కానీ ఏవైనా ఉంటే అందులో నీరు చేరకుండా ఆ ఇంటి యజమానులకు చెప్పాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వర్షాకాలం ప్రారంభం సందర్భంగా దోమలు మురుగు నీటిలో  ఏర్పడి విష జ్వరాలు  వచ్చే ప్రమాదం ఉందని అందుకోసం ముందు పరిసరాల్లో మురుగునీటిని చేరకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు.

 ఈ యొక్క కార్యక్రమంలో చిన్నంబావి కాలనీ ప్రజలు, మండల అధికారులు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State