ప్రభుత్వాసుపత్రి నందు నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంక్ (ఫ్రిజ్)
వాటర్ ట్యాంకు( ఫ్రిడ్జ్) యందు త్రాగడానికి మంచినీళ్లు అందించాలని కోరుతున్న రోగులు మరియు అక్కడికి వచ్చినటువంటి రోగుల బంధువులు
జోగులాంబ గద్వాల 23 మే 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన వాటర్ ఫ్రిడ్జ్ గత 3 నెలల నుంచి వాటర్ ట్యాంక్ పనిచేయడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులకు రోగుల బంధువులకు త్రాగడానికి నీళ్లు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. హాస్పిటల్ బయటికి వెళ్లి తాగడానికి నీళ్లు తెచ్చుకోవాలంటే రోగులను వదిలిపెట్టి వెళ్లడానికి ఇబ్బందిగా ఉందని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ పనిచేసే విధంగా చర్యలు చేపట్టి త్రాగడానికి మంచినీరు పోసి ఆస్పత్రికి వచ్చే రోగులకు మరియు రోగి తరుపున వచ్చేవారికి త్రాగడానికి నీటి సదుపాయం అందించగలరని ఆస్పత్రికి వచ్చేవారు తెలపడం జరిగింది.