పాఠశాలల పునః ప్రారంభం నాటికి విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందించాలి :
: జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల
పాఠశాలల పునః ప్రారంభం నాటికి విద్యార్థులందరికీ ఏకరూప దుస్తులు అందించే విధంగా త్వరితగతిన తయ్యారి చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. గురువారం కొత్తగూడెంలోని మహిళా శక్తి కుట్టు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఏకరూప దుస్తుల తయారీని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, బీసీ, ఎస్టి, ఎస్సీ, మైనార్టీ గురుకులాలు మరియు రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏక రూప దుస్తులు అందజేతకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 63399 విద్యార్థులు ఉండగా 126677 మీటర్ల క్లాత్ అవసరం ఉండగా ఈనెల 20వ తేదీన 1,16.167 మీటర్లు జిల్లా కేంద్రానికి చేరుకున్నది అని, ఇంకా 10,510 మీటర్ల క్లాత్ రావలసి ఉన్నదని తెలిపారు. జిల్లా కేంద్రాలకు చేరుకున్న క్లాత్ ను జిల్లా లోని 23 మండలాలకు పంపిణీ చేశామని తెలిపారు. ఏకరూప దుస్తుల తయారీకి గాను 93 మహిళా శక్తి కుట్టు బృందాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. విద్యార్థుల వారీగా కొలతలు తీసుకుని, మహిళా శక్తి కుట్టు కేంద్రాలకు తయారీకి అప్పచెప్పమన్నారు. ప్రభుత్వం పాఠశాలల పిల్లలకు ఏకరూప దుస్తులు అందించటంతో పాటు, స్వయం సహాయక సంఘాల వారికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. సంఘ సభ్యులు ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం ఆచరిస్తుందని తెలిపారు.
ఏకరూప దుస్తుల తయారీలో అలసత్వం సహించేది లేదు టెలికాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల.
అనంతరం జిల్లా లోని ఎం పి డి ఓ, ఎం ఈ ఓ, ఎం ఎన్ ఓ, ఏ పి ఎం లతో ఏకరూప దుస్తుల తయారీ పై జిల్లా కలెక్టర్ ప్రియాంక అల టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ
అన్ని మండలాల్లో ఇప్పటివరకు తయారైన దుస్తులు వివరాలు అధికారులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దుస్తుల తయ్యారి నత్త నడకన సాగడం పై అసహనం వ్యక్తం చేసారు. దుస్తుల తయారీలో అలసత్వం సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. దుస్తుల తయ్యారి త్వరిత గతిన పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు.పాఠశాల ప్రారంభం నాటికీ విద్యార్థులు అందరికి దుస్తులు అందించాలని ఆదేశించారు. దానికి అనుగుణంగా తయ్యారి చేపట్టాలి అని, అవసరం ఐన చోట టైలర్ లను పెంచాలని ఆదేశించారు. రానున్న పది రోజుల్లో దుస్తుల తయ్యారి పూర్తిచేయ్యాలని, దానికి అనుగుణంగా రోజుకు ఎన్ని దుస్తులు తయ్యారి చెయ్యాలి అనే ప్రణాళికలు రూపొందించుకొవాలని అధికారులకు సూచించారు. ప్రతి రోజు ఎన్ని దుస్తులు తయ్యారి పూర్తి అయినవి నివేదికలు అందించాలని అధికారులని ఆదేశించారు.తయ్యారి పూర్తి ఐన దుస్తులు పాఠశాలలకు అందించాలన్నారు.
ఈ కార్యక్రమం లో డి ఆర్ డి ఓ విద్యా చందన, డీఈవో వెంకటేశ్వర చారి మరియు విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.