ప్రతి పిర్యాదు పట్ల వెంటనే స్పందించి చట్ట ప్రకారం చర్యలు  : జిల్లా ఎస్పీ  రితి రాజ్,IPS

Apr 22, 2024 - 19:43
 0  28
ప్రతి పిర్యాదు పట్ల వెంటనే స్పందించి చట్ట ప్రకారం చర్యలు  : జిల్లా ఎస్పీ  రితి రాజ్,IPS

జోగులాంబ గద్వాల 22 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదు పట్ల వెంటనే స్పందించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, అలాగే  వచ్చిన ఫిర్యాదు పై తీసుకున్న చర్యలను బాధితులకు  తెలియజేయాలని జిల్లా ఎస్పీ  రితిరాజ్,IPS పోలీస్  అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన పిర్యాదు దారుల నుండి 10  ఆర్జీలను జిల్లా ఎస్పీ స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్ ల అధికారులకు ఫోన్ చేసి ఆయా ఫిర్యాదుల పై పోలీస్ అధికారులు తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ లకు వచ్చిన ఫిర్యాదుల పై వెంటనే స్పందించి చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని, అలాగే ఆయా ఫిర్యాదుల పై తీసుకున్న చర్యలను బాధితులకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. భూ తగాదాలు, ఆస్థి తగాదాల విషయంలో చట్ట ప్రకారం, నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా చూడాలని సూచించారు. ఫిర్యాదు దారులతో ఎస్పీ  మాట్లాడుతూ ---- బాదితులు నిర్భయంగా శాంతి భద్రతల కు సంబంధించిన తమ సమస్యలను పోలీస్ స్టేషన్ లలో తెలియజేయాలని అక్కడ తీసుకున్న చర్యల పై సంతృపి చెందలేదని భావిస్తే  ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం లో పిర్యాదు చేస్తే  వాస్తవాలను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ ఫిర్యాదు దారులకు భరోసా కల్పించారు.

ఈ రోజు వచ్చిన పిర్యాదులు: 

భూ వివాదాలకు సంబందించి 02 పిర్యాదులు,
గొడవలకు సంబందించి 01పిర్యాదు,
అక్షర చిట్ ఫండ్ చీటింగ్ కు సంబందించి -0 1పిర్యాదు.
ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు అని -01 పిర్యాదు.
అక్రమ ప్రైవేట్ వాహనాలను నియంత్రించాలని 01 పిర్యాదు.
ఇతర అంశాలకు సంబంధించి 04 పిర్యాదులు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333