జోగుళాంబ గద్వాల్ పోలీస్ ప్రజల మన్ననలు పొందేలా అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలి
గ్రామాలలో క్రైం ప్రివెన్షన్ పై దృష్టి పెట్టాలి వార్షిక తనిఖీల్లో భాగంగా గద్వాల్ రూరల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు ఐపీఎస్ గారు.
వార్షిక తనిఖీలలో భాగంగా ఈ రోజు జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ గారు గద్వాల్ రూరల్ పోలీస్ స్టేషన్ సందర్శించి స్టేషన్ రికార్డ్స్ ను,పోలీస్ స్టేషన్ పరిసరప్రాంతాలను పరిశీలించారు.
అనంతరం పోలీసు అధికారులు సిబ్బందితో ముఖాముఖి నిర్వహించారు. పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఏవైనా సమస్యలు ఉన్నాయ అని తెలుసుకొని సర్వీస్ కు సంబంధించిన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. విధినిర్వహణలో పోలీస్ అధికారులు సిబ్బంది పోటీపడి విధులు నిర్వహించాలని, అంకిత భావంతో విధులు నిర్వహించే వారికి రివార్డులు అవార్డులు ప్రతినెలా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. మరియు ఎవరికీ కేటాయించిన విధులు వారు బాధ్యతా నిర్వహించాలని, సిబ్బంది యొక్క వివరాలు, వారు నిర్వహిస్తున్న విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. వర్టికల్ వారిగా అధికారులు సిబ్బంది విధులు నిర్వహించాలని ప్రజల సమస్యలు తీర్చడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. ప్రజలతో మరియు పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని ఫిర్యాదుదారులందరికీ ఒకే రకమైన సేవలు అందించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ జిల్లా పరిధిలోనే ఉండి విధులు నిర్వహించాలని, సమయం దొరికినప్పుడు ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ప్రతిరోజు పోలీసు అధికారులు సిబ్బంది సమయం దొరికినప్పుడు వ్యాయామం, యోగ, ధ్యానం, వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ నీట్ టర్న్ అవుట్ కలిగి ఉండి, మంచి క్రమశిక్షణ సమయపాలన పాటించాలని లీడర్షిప్ లక్షణాలు కలిగి ఉండాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో 5s ఇంప్లిమెంటేషన్ ని పరిశీలించి ఫైలు సక్రమమైన పద్ధతిలో ఉంచాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏ తరహా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి అడిగి తెలుసుకున్నారు, గత మూడు సంవత్సరాల నుండి నమోదవుతున్న కేసుల గురించి కంపారిటివ్ స్టేట్మెంట్ ను పరిశీలించి, మరియు అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న సిడి ఫైల్స్ ను, పెండింగ్ ట్రాయల్లో ఉన్న సిడి ఫైళ్లను, గ్రేవ్ కేసెస్ లలో ఉన్న సిడి ఫైళ్లను పరిశీలించారు. రౌడీలు, కేడీలు, సస్పెక్ట్స్ మరియు సంఘ విద్రోహ శక్తులపై నిరంతరం నిఘా ఉంచి, వారి కదలికలను గమనించాలని తెలిపారు. రాత్రి పెట్రోలింగ్ అధికారులు పాత నేరస్తులను తనిఖీ చేయాలని తెలిపారు. విధినిర్వహణలో రోల్ క్లారిటీ, గోల్ క్లారిటీ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని సూచించారు. ప్రజల రక్షణ గురించి ఎల్లవేళలా అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలన్నారు, సిసీటిఎన్ఎస్ ప్రతి ఫైల్ ను ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. యఫ్.ఐ.అర్ లను, సిడిఎఫ్, పార్ట్-1, పార్ట్-2 రిమాండ్ సిడి, ఛార్జ్ షీట్, కోర్టు డిస్పోజల్ ఆన్లైన్ లో ప్రతి రోజు ఎంటర్ చేయలని ఆదేశించారు. అధికారులు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి క్రైమ్ రేటు తగ్గించాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇంస్టిగేషన్ ఉండాలని కేసులలో శిక్షల శాతం పెంచాలని సూచించారు. అధికారులు సిబ్బంది ప్రొయాక్టివ్ పోలీసింగ్ విధులు నిర్వహించాలని ఎస్పీ గారు తెలిపారు.
గ్రామాలలో పూర్తి సమాచారాన్ని
విపిఓ పోలీస్ అధికారులు తెలుసుకొని ఉండాలని, వారంలో రెండు మూడు సార్లు సంబంధిత గ్రామాలను సందర్శించి ప్రజలకు ఉన్న సమస్యలపై ఆరా తీయాలన్నారు, నేరం జరిగాక ఛేదించే కన్న నేరాలు జరగకుండా ముందస్తుగా గుర్తించి నేరాలు జరుగకుండ చూసుకోవాలని అన్నారు. సైబర్ నేరాల గురించి, మాదక ద్రవ్యాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే బాల్యవివాహాల వల్ల జరిగే నష్టాల గురించి యువతకు అవగాహన కల్పించాలని అన్నారు. పాత కొత్త నేరస్థుల పై నిఘా ఉంచాలని, గ్రామాలలో జరిగే నేరాలను ముందస్తుగా పసి గట్టి సంబంధిత అధికారులకు తెలియజేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డి .ఎస్పి సత్యనారాయణ గారు ,గద్వాల్ ఇంచార్జి సీఐ నాగేశ్వర్ రెడ్డి, ఎస్సై శ్రీకాంత్, పి ఎస్సై లు వెంకటేష్ , స్వాతి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.