ప్రతి ఓటును కాపాడుకోవాలి బిఎల్ ఏ లు క్షేత్రస్థాయిలోనే ఉండాలి
టీజీపీసీసీ జనరల్ సెక్రెటరీ, కాంగ్రెస్ పార్టీ సర్ నియోజకవర్గ ఇన్చార్జి సానెం శ్రీనివాస్ గౌడ్ గారు
గద్వాల పట్టణం మున్సిపాలిటీ వార్డులలో పర్యటించిన శ్రీనివాస్ గౌడ్ గారు
ఈ రోజు గద్వాల ఎమ్మెల్యే గారు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గారు, డీసీసీ అధ్యక్షులు రాజీవ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని 3, 33 11 10, 24 వార్డులలో మున్సిపల్ చైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మి నర్సింహులు యాదవ్ గారు, డిసిసి వైస్ ప్రెసిడెంట్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ రామేశ్వరమ్మ గార్ల ఆధ్వర్యంలో పర్యటించారు.
ఈ సందర్భంగా అబ్జర్వర్ శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ..
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు టిపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గార్ల ఆదేశాల మేరకు నియోజకవర్గంలో పర్యటించడం జరిగిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం సర్ పేరుతో ఓట్లను తొలగించేందుకు కుట్రలు చేసిందని వారి కుట్రలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, బిఎల్ ఏ లు ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉంటూ అర్హులైన ప్రతి ఓటును కాపాడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కలిసికట్టుగా ఏ ఒక్క ఓటు ను కూడా గల్లంతు కాకుండా, కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని శ్రీనివాస్ గౌడ్ గారు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా బిఎల్ఏలకు, బిఎల్ఓ లకు పలు సూచనలు చేశారు. ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్ ఫారంలో పంపిణీ మరియు స్వీకరణపై అడిగి తెలుసుకున్నారు. అలాగే డోర్ లాక్, డబుల్ ఓట్లు, మరణించిన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
బిఎల్ ఏ ల పనితీరుపై, అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పనితీరుపై, ఎప్పటికప్పుడు అధిష్టానానికి నివేదిక ఇవ్వడం జరుగుతుందన్నారు.
అలాగే పట్టణంలోని 24వ వార్డు 224 బూత్ లో 92 శాతం పూర్తిచేసిన బిఎల్ ఓ ను, బి ఎల్ ఏను, మున్సిపల్ అధికారులను శాలువతో సన్మానించారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, నాగులు యాదవ్, మోసిన్, డీసీసీ కార్యదర్శి పూడూరు శ్యామ్, మాజీ పట్టణ అధ్యక్షులు ఇసాక్, నాయకులు కురుమన్న, శ్రీనివాసులు, రిజ్వాన్ ఆయా వార్డుల బిఎల్ఏ లు తదితరులు పాల్గొన్నారు.