బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ సూర్యాపేటకు తీసుకవచ్చేలా కృషి 

22వ రోజు చేస్తున్న నిరాహార దీక్షలకు మద్దతు తెలిపి మాట్లాడిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

Sep 4, 2026 - 22:20
Sep 4, 2026 - 22:22
 0  0
బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ సూర్యాపేటకు తీసుకవచ్చేలా కృషి 

సూర్యాపేట, 04 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:-  సూర్యాపేట ప్రజల చిరకాల వాంఛ అయిన జాతీయ రహదారి 65 సమాంతర బుల్లెట్ రైలు కారిడార్ రైల్వే మార్గం సుగమం చేసేలా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, నితిన్ గడ్కరి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ల సహకారంతో సూర్యాపేట వాసిగా కృషి చేస్తానని మాజీ పార్లమెంటు సభ్యులు, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు బూర నర్సయ్య గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బుల్లెట్ ట్రైన్ కారిడార్ సాధన సమితి ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షకు సిఐటియు మద్దతు తెలిపి  22 వ రోజు దీక్షలో కూర్చున్నారు. ఈ దీక్షకు ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో నేను ఎంపీగా ఉన్న  సమయం లో సూర్యాపేటకు రైల్వే సౌకర్యం కల్పించాలని కోరిన సంగతి గుర్తు చేశారు. 65 జాతీయ రహదారి సమాంతరంగా హైదరాబాద్, సూర్యాపేట, జగ్గయ్యపేట, అమరావతి, చెన్నై విశాఖ పట్టణాల మీదుగా సైంటిఫిక్ గా భూసేకరణ చేసి బుల్లెట్ ట్రైన్స్ సౌకర్యాన్ని కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాదులో భూముల రేట్లు పెంచడానికే ఆలైన్మెంట్ మార్చారని ఆరోపించారు. ఎంపీగా ఉన్న సమయంలో చిట్యాలకు డ్రై ఫోర్ట్ ను కూడా మంజూరు చేయించాను అని గుర్తు చేశారు. బిజెపి తరఫున సూర్యాపేటకు రైల్వే సౌకర్యాన్ని కల్పించేలా సాధించి తీరుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బుల్లెట్ ట్రైన్ కారిడార్ సాధన సమితి కన్వీనర్ జానకీ రెడ్డి, మాజీ మున్సిపల్  చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ,బిజెపి జిల్లా నాయకులు చలమల్ల నరసింహ, బిజెపి అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కిషన్, బిజెపి పట్టణ అధ్యక్షుడు బూర మల్సూర్ గౌడ్, అఖిలపక్షాల నాయకులు సీనియర్ జర్నలిస్ట్ భూపతి రాములు, సట్టు నాగయ్య, గండూరి శంకర్, సిఐటియు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333