ఢిల్లీలో విద్యార్థులు యువతపై పోలీసుల లాఠీచార్జీ దమనకాండ అమానుషం ---CPI
కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వానికి ఇంత అహంకారమేమిటి ?
అన్యాయం పట్ల ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని
ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి
సి.పి.ఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు డిమాండ్
ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై న్యాయం కోరుతూ నిన్న శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై పోలీసులు అమానుషంగా దాడి చేస్తూ లాఠీచార్జీ చేయడం అత్యంత హేయమైన చర్యగా, ప్రజాస్వామ్య హక్కులపై దాడిగా పేర్కొంటూ తక్షణమే ఈ దేశ ప్రధానమంత్రి, హోం శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలో జరిగిన పేపర్ లీకేజీపై వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన సంఘటనపై సిపిఐ జిల్లా కార్యాలయం గద్వాలలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ సంఘటన తీవ్రమైనదిగా ఆవేదన కలిగించేదిగా పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన అసలు సూత్రధారులను కాపాడుతూ, న్యాయం కోరుతున్న విద్యార్థులపై పోలీసులు బలప్రయోగానికి పాల్పడటం, దాడి చేయడం అమ్మాయిల దుస్తులు చించడం రక్తం కార్యవర్గ విద్యార్థులను కొట్టడం ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శన మన్నారు.విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం వారిపై లాఠీలు ఎత్తడం సిగ్గుచేటని అన్నారు. పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఈ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయించాలని ఇది చేయకుండా రెండు నెలలుగా న్యాయం కావాలని దేశంలో లక్షలాదిమంది విద్యార్థులు యువకులు మేధావులు ఆందోళన చేస్తున్న ఈ మోడీ నిరంకుశ నియంతృత్వ ప్రభుత్వం సమాధానం చెప్పకుండా స్పందించకుండా విద్యార్థుల ప్రాణులతో జీవితాలతో చెలగాటమాడటం ప్రజాస్వామ్య స్ఫూర్తి కి చాలా విరుద్ధంగా ఉందన్నారు నిన్నటి ఘటన దుర్దినంగా భావించాల్సి ఉంటుందన్నారు. దేశ యువతకు నాణ్యమైన, పారదర్శకమైన విద్యా వ్యవస్థను అందించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని, కానీ పరీక్షల నిర్వహణలో వరుస వైఫల్యాలు, అవినీతి, నిర్లక్ష్యంతో విద్యార్థుల విశ్వాసాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తోందని విమర్శించారు. విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, పోలీసుల దౌర్జన్యంపై స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలతో విచారణ జరిపించాలని, నీట్ పేపర్ లీకేజీ కుట్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుని బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భరత్ బి ప్రవీణ్ కుమార్ సిపిఐ మండల సహకరించి నారాయణ విద్యార్థి నాయకుడు యామప్ప ఏఐటిసి కార్మిక సంఘం నాయకులు రవి మహేందర్ తదితరులు పాల్గొన్నారు