**ప్రజా సమస్యలపై స్పందిస్తున్న తెలుగుదేశం పార్టీ""మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీ తొండపు జనార్దన్*

ప్రజల సమస్యలపై స్పందిస్తున్న తెలుగుదేశం పార్టీ
ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ.** మంగళగిరి, ఆగస్టు 14:
ఈరోజు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన పలు ప్రాంతాల ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. ప్రజల అర్జీలను స్వీకరించిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ మరియు జయప్రద ఫౌండేషన్ చైర్మన్
శ్రీ *తొండపు దశరథ జనార్ధన్* గారు ముఖ్యంగా పాల్గొన్నారు.
అవకాశం దొరికిన ప్రతి ఒక్కరితో మాట్లాడిన ఆయన, ప్రజల సమస్యలను వివరంగా విని వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన్ను కలిసిన ప్రజలు, తక్షణ స్పందనపై హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు కూడా హాజరయ్యారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ, వారి సమస్యలను ప్రత్యక్షంగా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు కొనసాగుతాయని శ్రీ దశరథ జనార్ధన్ గారు తెలిపారు.
#Team Td Janaradhan #