**ఘనంగా మల్లన్న జన్మదిన వేడుకలు""కోదాడ పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు*

Aug 14, 2025 - 19:23
 0  56
**ఘనంగా మల్లన్న జన్మదిన వేడుకలు""కోదాడ పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు*

*ఘనంగా మల్లన్న జన్మదిన వేడుక*

తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ*****కోదాడ మాజీ శాసనసభ్యులు, BRS పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ *బొల్లం మల్లయ్య యాదవ్ గారి* జన్మదిన వేడుక కోదాడ పట్టణ BRS పార్టీ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కోదాడ పట్టణంలో ఆయన నివాసంలో కోదాడ పట్టణ BRS పార్టీ అధ్యక్షుడు షేక్ నయీమ్ ఆధ్వర్యంలో భారి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తన ఐదేళ్ళ పాలనలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని, గత ఎన్నికలలో ఓటమి పాలైనా నియోజకవర్గాన్ని వదిలి పెట్టకుండా ప్రతినిత్యం నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం, నియోజకవర్గ అభివృద్ధిని కోరుకునే ప్రజానాయకుడు మల్లన్న అని అన్నారు. అకాల వర్షాల కారణంగా జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని చెప్పినప్పటికీ అభిమానుల కార్యకర్తల వత్తిడి మేరకు మల్లన్న జన్మదిన వేడుకలు నిర్వహాంచడం జరిగిందని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని, భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటు మల్లన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కోదాడ టౌన్ మరియు మండల పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన భారి కేకులను కట్ చేసి వేడుక నిర్వహించారు. 

 

ఈ కార్యక్రమంలో కోదాడ పట్టణ నాయకులు పయిడిమర్రి సత్యబాబు, కుక్కడపు బాబు, సంగిశెట్టి గోపాల్, కర్ల సుందర్ బాబు, పిట్టల భాగ్యమ్మ, మేదర లలిత, కందుల చంద్రశేఖర్, మామిడి రామారావు, అలవాల వెంకట్, సంపెట ఉపేందర్ గౌడ్, అనంతగిరి మండల అధ్యక్షుడు నల్లా భూపాల్ రెడ్డి, చిలుకూరు మండల అధ్యక్షుడు అక్కినపల్లి జానకిరామాచారి, మునగాల మండల అధ్యక్షుడు తొగరు రమేష్, కూచిపూడి మాజీ సర్పంచ్ శెట్టి సురేష్ నాయుడు, కర్ల నరసయ్య, చలిగంటి వెంకట్, జాని ఆర్ట్స్, షేక్ అబ్దుల్ అలీమ్, షేక్ నిస్సార్, షేక్ దస్తగిరి, లాజర్, షేక్ ఖలీమ్, గుండె రాజేష్, కనగాల శ్రీధర్, కోదాటి కృష్ణయ్య, పొదిల క్రాంతి, గడ్డం యేసు, మువ్వా గోపాలకృష్ణ యాదవ్, ఈదులపురం శ్రీనివాసరావు, పంది శంకర్, గొర్రె రాజేష్, తదితరులు పాల్గొన్నారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State