ప్రజాస్వామిక సంస్కృతి లేకుంటే  దుర్భాషలకు కొదవ ఎక్కడిది?  

Mar 2, 2024 - 21:20
 0  3

.అధికారమే శాశ్వతమని బెదిరించే అహంకార ధోరణి.ఏనాడైనా మట్టిలో కలవాల్సిందే.

తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే,

ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా స్వీకరించ గలిగే  సంస్కారం లేకుంటే ఆ రాజకీయపార్టీ సమాదే .

ఆ చరిత్రహీనులకు  కారాగారమే నివాసం కావాలి.

ఒక ప్రభుత్వం ప్రజాస్వామ్య సంస్కృతిని గౌరవించి,  మానవ హక్కులను ప్రేమించి,  ప్రజలను పాలనలో భాగస్వాములను చేసుకోగలిగినప్పుడు , ప్రజలను బానిసలుగా కాకుండా యజమానులుగా భావించినప్పుడు  మాత్రమే ఆ ప్రభుత్వం  ప్రజాస్వామిక ప్రభుత్వం అవుతుంది . గత 10ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన టిఆర్ఎస్ పార్టీ  మానవహక్కులను కాలరాశి , ప్రజాస్వామిక విలువలను తుంగలో తొక్కి,  మంత్రులు శాసనసభ్యులు మేధావులు ఉద్యమకారులకు కూడా  ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేకుండా  కంచెలు నిర్మించి,  ప్రజా సంబంధాలను కొల్లగొట్టి,  ఫామ్ హౌస్  ప్రగతి భవన్ లకు మాత్రమే పరిమితమై  ప్రజలను యాచకులుగా దిగజార్చిన చరిత్ర brs ప్రభుత్వానికి ఉన్నది  .తెలంగాణ రాష్ట్రం తమ వల్లనే ఏర్పడినది అనే అహంకారం దీనికి పెద్ద మూలం . ముందుగా తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీ అనే విషయాన్ని మరిచిపోవాలి.  తెలంగాణ సాధన కోసం టిఆర్ఎస్ పార్టీ కేవలం రాజకీయ ప్రక్రియ కొనసాగించినది కానీ  మేధావులు,  విశ్లేషకులు, కవులు, కళాకారులు ,సబ్బండవర్ణాలు, అనే ఉద్యమకారులు మాత్రమే  తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందున్నారని అందరం గ్రహించాలి.  టిఆర్ఎస్ ప్రభుత్వం ముందుగా  తన వల్ల తెలంగాణ వచ్చింది అనే వాదన నుండి బయటపడాలి.

 టిఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లు పరిపాలించిన తర్వాత  ఎన్నో ఆకాంక్షలతో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ ప్రభుత్వానికి కొంత సమయం అవసరం అని ఆనాడు ఉద్యమకారులు ప్రజలు మేధావులు అంగీకరించినారు. ఏనాడు కూడా ప్రశ్నించకుండా, బెదిరించకుండా ,విమర్శించకుండా, మద్దతిస్తూ సహకరిస్తూ సబ్బండ వర్ణాలు  కేసీఆర్ ప్రభుత్వాన్ని మా ప్రభుత్వం అని  కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకున్నారు . ఇక ప్రతిపక్షాలు కూడా కొంతకాలం వరకూ వేచి ఉండి ఆ తర్వాత మాత్రమే ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం ,  ముఖ్యమంత్రి దళితున్ని చేస్తానని ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం, దళితులకు మూడెకరాల భూమి అంటూ రక రకాల వాగ్దానాలు చేసే , డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కూడా ఎక్కడ కూడా నిర్మించక,  ప్రభుత్వ ఆస్తులను కొలగొట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా శాసనసభ్యులు అక్రమాలకు పాల్పడుతుంటే ప్రభుత్వం  చూసి చూడనట్లు ఊరుకునేది . ముఖ్యంగా ముఖ్యమంత్రి స్వయంగా లక్ష కోట్ల అవినీతి  పాల్పడినట్లు  నేటి ముఖ్యమంత్రి ఆనాటి పీసీసీ రేవంత్ రెడ్డి చేసిన విమర్శ మనకు ప్రత్యక్ష ఉదాహరణ . పేరుకు తెలంగాణ ఆకాంక్షల మేరకు పనిచేస్తున్నట్లుగా ప్రకటించినప్పటికీ కుటుంబ పరిపాలనను ఈ దేశంలో  పకడ్బందీగా విస్తరించుకున్న  ఏకైక కుటుంబం గా కేసీఆర్ను ప్రపంచ  నిపుణులు వర్ణిస్తున్నారు అంటే  వాళ్ల పనితీరు ఏ రకంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు
 దాని పర్యవసానంగానే  ఎన్నికల సందర్భంలో మేధావులు కేసీఆర్ కు వ్యతిరేకంగా  ఓటు వేయాలని అవినీతి అక్రమార్జనపైన ప్రజల్లో బహిరంగంగా  చర్చ చేసిన విషయం తెలుసు.

అయినా తగ్గని టిఆర్ఎస్ అహంకారం:-

  ఇటీవల జరిగిన పార్లమెంటు అసెంబ్లీ సెగ్మెంట్ల సమీక్ష సమావేశాలలో  మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్  హద్దు అదుపు లేకుండా ప్రజాస్వామిక విలువలను కాలరాచి  ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ఖాత ర్ చేయకుండా అగౌరవపరిచే విధంగా వందలసార్లు మాట్లాడిన విషయం మనందరికీ తెలిసిందే.  తాను మాత్రమే ముఖ్యమంత్రి కానీ ఎదుటి వాళ్ళు ఆ స్థానంలో కూర్చుంటే ముఖ్యమంత్రి కాదు అనే అహంకార ధోరణి టిఆర్ఎస్ పార్టీ విడనాడాలి.  నిర్మాణాత్మక సూచనలతో  అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని కొనసాగించడానికి విలువైనటువంటి సూచనలు చేయాలి.  కానీ ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి,   ప్రజా జీవితాన్ని ఆర్థిక విధ్వంసంలోకి నెట్టి , ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా,  ప్రకృతి గుట్టల విధ్వంసాన్ని యదేచ్ఛగా కొనసాగించి , పంట పండించని భూములకు  కూడా రైతుబంధును కట్టబెట్టి  ,అమెరికా లాంటి ఇతర దేశాలలో ఉన్న వారి జేబుల్లో లక్షలాది రూపాయలను  ముట్ట చెప్పిన అవినీతి  టిఆర్ఎస్ ప్రభుత్వముది.  వీరీ పైన ఇప్పటికే న్యాయ విచారణ జరగాల్సి ఉన్నది  కుటుంబ సభ్యులందరి పైన అనేక ఆరోపణలు ఉన్నవేళ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే  విచారణ జరిపించి దోషులుగా తేల్చి కటకటాల్లోకి నెట్టి నష్టపరిహారాన్ని రాబట్టి ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలి .ఇది చరిత్రాత్మకంగా నిలిచిపోవలసిన అంశం.

టిఆర్ఎస్ నాయకుల బెదిరింపు దూర్భాషల పైన కోర్టు  సుమోటో గా స్వీకరించాలి :-

అధికారానికి వచ్చి రెండు రోజులు కాకముందే  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బెదిరించడం ప్రారంభించిన టిఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ రెండు నెలలు కావస్తున్న ప్రతిరోజు అహంకారపూరితంగా ఇష్టం ఉన్న రీతిలో దుర్భాషలాడుతూ ముఖ్యమంత్రి ప్రభుత్వం అనే గౌరవ మర్యాదలు లేకుండా  మాట్లాడమంటే ప్రజలను ఓటర్లను అవమానపరచడమే అవుతుంది  .అనేక ఆటంకాలు కల్పిస్తున్నటువంటి టిఆర్ఎస్  పార్టీ పైన ముఖ్యమంత్రి కొన్ని పరుష పదాలను వాడి హెచ్చరించినప్పుడు  దానిని ఖండించే పద్ధతి లోపల అందరూ నాయకులు ఇష్టమున్నట్టుగా మాట్లాడడంతో పాటు  మంచిర్యాలలో మాజీ శాసనసభ్యుడు బాల్క సుమన్  ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతా అని పదేపదే చెప్పులు తీసి సభలో ప్రదర్శించిన తీరు  గర్హనీయం  .టిఆర్ఎస్ పార్టీకి ,ఆ నాయకులకు, నాయకత్వం వహించిన మాజీ ముఖ్యమంత్రికి దుర్భాషలాడే సంస్కృతి ఉన్న కారణంగానే గతంలో బిజెపి కేంద్ర ప్రభుత్వంతో అనేక వివాదాలు కొనసాగిన విషయం తెలుసు  .టిఆర్ఎస్ అధికారంలో ఉన్న నాడు కాంగ్రెస్ ఏనాడు కూడా ఈ రకమైనటువంటి పదజాలాన్ని బెదిరింపులను ఆదేశాలను ఇవ్వలేదు 

ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సందర్భాలలో విలేకరులను, రాజకీయ నాయకులను , కష్టాన్ని చెప్పుకోవడానికి వచ్చినటువంటి ప్రజలను,  కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని, కేంద్రమంత్రిని  ప్రతి ఒక్కరిని కూడా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడిన తీరును  స్క్రోలింగ్లలో గనుక  చూడగలిగితే  అంతకుమించిన అవమానం లేదు.  కేంద్ర మంత్రులను రoడ అనడం, వాడు వీడు,  దద్దమ్మలు  అనడంతో పాటు  రాష్ట్రానికి ప్రధానమంత్రి వచ్చిన ఏ సందర్భంలో కూడా గౌరవించని కలవని ఒక ముఖ్యమంత్రి ఉన్నాడంటే అతడు కేసీఆర్ మాత్రమే.  ఇంతటి ప్రజాస్వామిక వ్యతిరేక లక్షణాలు కలిగి ఉండి ఇష్టం ఉన్నట్లుగా అహంకారపూరితంగా దౌర్జన్యపూరితంగా అధికారంలో ఉన్నప్పుడు,  అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్న నేడు కూడా ప్రభుత్వాన్ని గౌరవించకుండా మాట్లాడమంటే  తమ గోతినే థా మే తవుకోవడమనీ ప్రజలు గమనిస్తున్నారు . బాల్క సుమన్ చెప్పు చూపించిన సంఘటనకు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు,  ప్రజాసంఘాలు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున నిరసన తెలిపిన విషయం అందరికీ తెలిసిందే . చట్టం తన పని తాను చేసుకు పోతుంది కచ్చితంగా బోనులో నిలబెడుతుంది . కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నది కనుక  చిన్న ఆలోచన చేయలేని సందర్భంలో  కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నది. కానీ ఈ విషయంలో చాలామంది ప్రజలు మేధావులు వెంటనే తెలంగాణ  ద్రోహులు అయినటువంటి టిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరిపై  విచారణకు డిమాండ్ చేయాలి. మేడిగడ్డ కాలేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అవినీతిపైన ఇప్పటికీ ఒక్కసారి కూడా మాజీ ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం అవివేకం . సిబిఐ, సి ఐ డి, ఇ డి వంటి సంస్థల ద్వారా విచారణ జరిపించి  అహంకారానికి అడ్డుకట్ట వేయాలి  .రాష్ట్ర హైకోర్టు కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి  దుర్భాషల ధోరణిని , ప్రభుత్వాన్ని అగౌరవపరిచే పద్ధతిని  ,మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల అవినీతిపైన  సుమోటోగా స్వీకరించి ఈ రాష్ట్రాన్ని అప్పుల నుండి  అరాచక వాదుల నుండి కాపాడవలసిన అవసరం చాలా ఉన్నది.  ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో మానవ హక్కులు ,పౌర హక్కులు ,ప్రజాసానిక విలువలు , కొట్లాడే శక్తులకు అనుమతిస్తూ  మేధావులు యొక్క సలహాలతో  పా లనాపరమైన సంస్కరణలు కొనసాగుతూ ఉంటే  తట్టుకోలేని టిఆర్ఎస్ పార్టీలోనే నలుగురై దుగురు నాయకులు  బరితెగించి మాట్లాడుతున్నారంటే రేపు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అంతకుమించిన పరాభవాన్ని చవిచూస్తారని చెప్పక తప్పదు.  ప్రజలు కూడా టిఆర్ఎస్ పార్టీ గత విధానాన్ని, పాలనా విధానాన్ని, ప్రస్తుత  అహంకారపూరిత దౌర్జన్యాలను ఎండ కట్టడం  ద్వారా చెక్ పెట్టాలి . టిఆర్ఎస్ పార్టీ రాజకీయ ప్రయాణానికి  గో రి కట్టాల్సిన అవసరం ఆసన్నమైనది.  ఇక చట్టం తన పని తాను చేసుకు పో వాలి నేరస్థులను మాత్రం శిక్షించకుండా ఉంటే ప్రజలు ఊరుకోవడానికి సిద్ధంగా లేరు అని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలి


---వడ్డేపల్లి మల్లేశం .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు  ఉపాధ్యాయ ఉద్యమ నేత  హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333