ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు 

32వ వార్డు కౌన్సిలర్ జహీర్

Jan 23, 2025 - 20:47
Jan 23, 2025 - 20:47
 0  1
ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు 

సూర్యాపేట. 24 జనవరి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని 32వ వార్డు కౌన్సిలర్ జహీర్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గురువారం  వార్డు సభ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  అర్హులైన వారందరూ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకొనుటకు, ఇంటి స్థలం కొరకు, రైతు భరోసా వంటి పథకాలను ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ బి, శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ గుణగంటి వంశీ, మండారి డేవిడ్ కుమార్, మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, వార్డ్ ఆఫీసర్ ఉమారాణి, ఆదినారాయణ, సతీష్, ఆర్ పి పంతంగి లక్ష్మమ్మ, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333