ప్రజలను ఇ,ఎం,ఐ ల పేరుతో వేదిస్తున్న ఫైవ్ స్టార్ ఫైనాన్స్ ను జిల్లాలో మూసివేయాలి
మేనేజర్,ఏజెంట్ల వేధింపులకు తాళలేక నిరుపేద దళితుడు క్యాతురు నర్సింహులు ఆత్మహత్యయత్నం
బాధితుడి ప్రాణం పదిరోజులైన తర్వాత చెప్పలేము అన్న డాక్టర్లు కర్నూల్ ఆసుపత్రిలో చికిత్స
ఫైవ్ స్టార్ ఫైనాన్స్ అజెంట్లను, మేనేజర్ ను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలనీ కఠిన చర్యలు తీసుకోవాలని శాంతినగర్ ఎసై నాగ శేఖర్ రెడ్డి ని కలసి పిర్యాదు
మాచర్ల ప్రకాష్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు, ఎస్సి, ఎస్టీ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సభ్యులు
Mrps అల్లంపూర్ తాలూకా ఇంచార్జి జయరాజు,సీనియర్ నాయకులు మిట్టదొడ్డి ఇమనెల్, జిల్లా నాయకులు శ్రీను
జోగులాంబ గద్వాల27 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త ప్రతినిధి :- మండలం, క్యాతూరు గ్రామానికి చెందిన నిరుపేద దళిత కుటుంబానికి చెందిన నర్సింహా అనే వ్యక్తినీ ఫైవ్ స్టార్ ఫైనాన్స్ మేనేజర్లు, ఏజెంట్లు కలసి పలు రకాల తీవ్ర వేధింపులకు గురి చేయడం వలన పూర్తి మర్యాదలు పోవడంతో మనస్థాపానికి గురై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకోవడం జరిగింది 2 లక్షల వరకు కిస్తీలు కట్టుకుంటూ వస్తున్నా నెల ఆలస్యం అయ్యిందని తీవ్ర వేధింపులకు ఫైవ్ స్టార్ ఫైనాన్స్ ఏజెంట్లు, మేనేజర్ వేధించడం తో తీవ్ర మనస్థాపానికి నర్సింహులు గురైనాడు, మూడు నెలలు అయినా కిస్తీ కట్టకున్న నోటీసు పంపించాలి అయినా కూడా కట్టకపోతే కోర్టులో రికవరీ సూట్ వేసుకోవాలి కానీ అలా కాకుండా ఫైవ్ స్టార్ ఫైనాన్స్ ఏజెంట్లు మేనేజర్ అధిక వడ్డీ వేస్తూ లోన్ తీసుకున్న వారి ఇండ్లకు వెళ్లి 5,6 మంది రౌడీలలా వచ్చి బెదిరించి అవమానిస్తున్నారనీ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఫైవ్ స్టార్ ఫైనాన్స్ ఆగడాలు ఎక్కువ అయ్యాయని లోన్ తీసుకున్న వారి ఇంటి దగ్గరికి వచ్చి మర్యాదలు పూర్తిగా తీస్తూ కస్టమర్లను వొళగారగా మాట్లాడుతూ వారిని హింసిస్తున్నారు. వారి ఆత్మహత్యలకు కారకులు అవుతున్నారు, దళిత నిరుపేద కుటుంబానికి చెందిన నర్సింహులు ప్రణాపాయ స్థితిలో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు పదిరోజుకు అయితే కానీ ప్రాణాలు గ్యారెంటీ ఇవ్వాలెమని చెప్పారు ఫైవ్ స్టార్ ఫైనాన్స్ ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు, ఫైవ్ స్టార్ ఫైనాన్స్ అజెంట్లను, మేనేజర్ ను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలనీ కఠిన చర్యలు తీసుకోవాలని శాంతినగర్ ఎసై నాగ శేఖర్ రెడ్డి ని కలసి పిర్యాదుచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రాజ్ కుమార్, వెంకటేష్, అంబేద్కర్ సంఘం అయిజ మండల నాయకులు పులికల్అశోక్,తదితరులు పాల్గొన్నారు.