పోషణ పక్వాడ లో 8 తేదీ నుంచి 22 తేదీ వరకు పోషకాహారం పై విస్తృత ప్రచారం
జోగులాంబ గద్వాల 22 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త ప్రతినిధి:-
పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇటిక్యాల అంగన్వాడి కేంద్రం మండలం లో పోషణ పక్వాడ కార్యక్రమము నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సిడిపిఓ సుజాతమా మాట్లాడుతూ
,గర్భిణీ బాలింతలకు పోషకాహార ప్రాముఖ్యత గురించి అవగాహన కలిగించడం జరిగింది.
మొదటి 1000 రోజులలో చిన్నారుల మెదడు అభివృద్ధి మరియు తీసుకునే పోషకాహారం గురించి గర్భిణీలకు బాలింతలకు అవగాహన కల్పించడం జరిగింది .అలాగే బాలింతలకు గృహ సందర్శన ద్వారా డెలివరీ అయిన అరగంట లోపు తల్లి పాలు ఇవ్వడం అలాగే మొదటి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి అని ఆరు నెలల తర్వాత అదనపు ఆహారం బిడ్డకు ఇవ్వాలి అని తల్లులకు చెప్పడం జరిగింది .కిషోర బాలికలకు రక్తహీనత పై అవగాహన కలిగించడం జరిగింది. అలాగే గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం మరియు ఫ్రీ స్కూల్ పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు కిషోర బాలికలు, ఐసిడిఎస్ CDPO సుజాత సూపర్వైజర్ పరమేశ్వరి జయమ్మ అంగన్వాడీ టీచర్స్ గర్భిణీలు పిల్లలతల్లులు తదితరులు ఉన్నారు.